Recent Posts

ఉత్తరప్రవేదేశ్ లో కాంగ్రెస్‌ పార్టీకి కొలుకోలేని దెబ్బ

అమరావతి: గాంధీల కుటుంబంతో మూడు తరాల అనుబంధం ఉన్న కేంద్ర మాజీ మంత్రి జితిన్ ప్రసాద్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌ బై చెప్పారు..దింతో కాంగ్రెస్‌ పార్టీకి ఉత్తరప్రవేదేశ్ లో కొలుకోలేని దెబ్బతగలింది..బుధవారం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు..రాహుల్‌ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా పేరున్న జితిన్ ప్రసాద్,,2019లో పార్టీ వీడుతారనే ప్రచారం జరిగింది..అయితే అప్పట్లో ప్రియాంకాగాంధీ నచ్చజెప్పడంతో ఆయన వెనక్కి తగ్గారు..2022లో యూ.పీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో ప్రియాంకాగాంధీ ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని పని చేస్తున్న సమయంలో తగిలిన ఈ షాక్ నుంచి కాంగ్రెస్ వర్గాలు కోలుకోవడం కష్టమే అని రాజకీయ పరిశీలకు భావిస్తున్నారు.. పార్టీలో చేరిన అనంతరం జితిన్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ బీజేపీ మాత్రమే నిజమైన రాజకీయ పార్టీ,,ఇది ఏకైక జాతీయ పార్టీ,,మిగిలిన పార్టీలు అన్నీ ప్రాంతీయ పార్టీలని వ్యాఖ్యనించారు..బీజేపీ, ప్రధాని నరేంద్ర మోడీ మాత్రమే ఇప్పుడు దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను ఎదుర్కోగలరని,,అయితే దేశ శ్రేయస్సు దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకునేందుకు చాలా చర్చించాల్సి వచ్చిందన్నారు.. బీజేపీ దేశ ప్రజల ప్రయోజనాల కోసం పనిచేసే పార్టీ..ప్రజల తరఫున నిలబడుతుంది కాబట్టి తాను బీజేపీలో చేరినట్టు చెప్పుకొచ్చారు..మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ ప్రజలకు సహాయం చేయలేకపోతే పార్టీగా ఉండటంలో అర్థం ఏమిటి? అని ప్రశ్నించారు..

Spread the love