AMARAVATHI

30 నెలల్లో దేశంలోని ఐదు అత్యుత్తమ రాజధానుల సరసన అమరావతి-మంత్రి నారాయణ

రాజధాని అభివృద్ధికి పక్కా ప్రణాళిక..

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధానిగా అమరావతిని అద్భుతంగా అభివృద్ధి చేసి దేశంలోని ఐదు అత్యుత్తమ రాజధానుల సరసన నిలిపేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. శనివారం నెల్లూరు రూరల్‌ మండలం చింతారెడ్డిపాలెంలోని నారాయణ మెడికల్‌ కళాశాల ఆవరణలోని తన స్వగృహంలో మంత్రి, పాత్రికేయులతో మాట్లాడుతూ 2015 జనవరిలో అమరావతి రాజధాని నిర్మాణానికి కేవలం 58 రోజుల్లో 34వేల ఎకరాల భూములను రైతులు అందజేశారని, కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబుపై నమ్మకంతోనే తమ భూములను రాజధాని ఏర్పాటుకు కేటాయించారని మంత్రి గుర్తుచేశారు. ఇది ఒక రికార్డు అని, ఈ విషయాన్ని  ప్రముఖ హర్వర్డ్‌ యూనివర్శిటీ ఒక కేసు స్టడీగా తీసుకుని తమతో ప్రత్యేకంగా మాట్లాడినట్లు చెప్పారు. 48 వేల కోట్ల రూపాయలతో రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పనులకు టెండర్లు కూడా పిలవగా, 9వేల కోట్లతో ప్రభుత్వ కార్యాలయ భవన నిర్మాణాలు, రోడ్లు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ మొదలైన మౌలిక వసతులు కల్పించామన్నారు. అనేక భవన నిర్మాణాలు వివిధ దశల్లోనే నిలిచిపోయాయని, వీటిని పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు స్పష్టం చేశారు. అధికారులతో చర్చించి ఒక కార్యాచరణ రూపొందించుకుని సుమారు రెండున్నరేళ్లలోనే అమరావతి రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు కృషి చేస్తామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. 2014లో తాను మున్సిపల్‌, పట్టణ అభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న సమయంలో రాజధాని నిర్మాణానికి వేగంగా  పనులు చేపట్టామని, అదే స్ఫూర్తితో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనపై మరోసారి రాజధానిని అభివృద్ధి చేసే బాధ్యతను తనపై ఉంచారని, ఆయన నమ్మకాన్ని నిలబెట్టేందుకు రాజధాని అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తానని ఈ సందర్భంగా మంత్రి నారాయణ పేర్కొన్నారు.

మున్సిపాలిటీల అభివృద్ధికి పెద్దపీట: 2014 నుంచి 2019 వరకు తమ పరిపాలనలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి రాష్ట్రంలోని 114 మున్సిపాల్టీలలో పెద్దఎత్తున పార్కులు, రోడ్లు, డ్రైనేజీలు, డివైడర్లు, పాఠశాలల్లో మౌలికవసతులు మొదలైన అభివృద్ధి పనులు చేపట్టామని మంత్రి నారాయణ చెప్పారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన క్షణాల్లోనే ప్లాన్‌ అప్రూవల్‌ ఇచ్చేలా చర్యలు చేపట్టామన్నారు. ఎటువంటి ఛార్జీలు కూడా ప్రజల నుంచి వసూలు చేయలేదన్నారు. గత ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారం మోపిందని, చెత్తపన్నుతో ప్రజలు బాగా ఇబ్బందులుపడ్డారని మంత్రి చెప్పారు. అధికారులతో సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అలాగే నిరుపేదల సొంతింటి కలను సహకారం చేసేందుకు అత్యాధునికి టెక్నాలజీతో 11లక్షల టిడ్కో ఇళ్లను నిర్మించామని, వీటిని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, త్వరలోనే అన్ని సౌకర్యాలతో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసేందుకు కూడా ప్రత్యేక దృష్టి సారిస్తామని మంత్రి చెప్పారు. అధికారులతో త్వరలోనై సమావేశమై మున్సిపాలిటీల పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, పెండింగ్ లో పనులపై చర్చించి మున్సిపాలిటీలను అభివృద్ధిపథంలో నడిపించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

సీబీఐ కోర్టులో ఉన్న జగన్‌ కేసులను రోజువారీగా విచారించండి-తెలంగాణ హైకోర్టు

హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేసుల పిటిషన్‌కు సంబంధించి తెలంగాణ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది.. జగన్ కేసులకు…

9 hours ago

తిరుమలలో దళారుల ఏరివేతకు చర్యలు తీసుకోండి – టీటీడీ ఈవో జె.శ్యామలరావు

తిరుమల: తిరుమల శ్రీవారి భక్తులను మోసగిస్తున్న దళారులను కనిపెట్టి ఎప్పటికప్పుడు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా టీటీడీ ఈవో జె.శ్యామలరావు…

9 hours ago

రాష్ట్ర వ్యాప్తంగా 12 జిల్లాలకు కొత్త కలెక్టర్లు

నెల్లూరుకు ఒ.ఆనంద్.. అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లా కలెక్టర్​లను నియమిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. శ్రీకాకుళం…

1 day ago

తిరుపతి జిల్లా కలెక్టర్ గా డా.ఎస్. వెంకటేశ్వర్ ఐ.ఎ.ఎస్

తిరుపతి: డైరెక్టర్ సెకండరీ హెల్త్ గా ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న డా.ఎస్.వెంకటేశ్వర్ ఐ.ఎ.ఎస్ ను తిరుపతి జిల్లా కలెక్టర్ గా…

1 day ago

రూ.249కి కొత్త ప్లాన్ ప్రవేశ పెట్టిన BSNL

అమరావతి: దేశీయ ప్రభుత్వ రంగ టెలికం సంస్థ (BSNL) వినియోగదారులను ఆకట్టుకోవడానికి ఒక కొత్త ప్లాన్‌ను పరిచయం చేసింది.. దీని…

1 day ago

రూ.10,20 నాణేలను తిరస్కరిస్తే చట్ట ప్రకారం నేరం-ఉత్తర్వులు జారీ చేసిన రిజర్వ్ బ్యాంకు

IPC సెక్షన్ 124A... అమరావతి: ప్రభుత్వం గుర్తించిన 10 లేక 20 రూపాయల నాణేలను తిరస్కరిస్తే చట్ట ప్రకారం నేరం…

2 days ago

This website uses cookies.