Recent Posts

టాటా సన్స్‌ చేతుల్లోకి వచ్చిన ఎయిర్‌ ఇండియా

అమరావతి: ఎయిర్‌ ఇండియా సంస్థ ఎట్టకేలకు తిరిగి టాటా సన్స్‌ చేతుల్లోకి వచ్చింది..పెట్టుబడుల ఉపసంహారణలో భాగంగా కేంద్రప్రభుత్వం,,భారీ నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్ధ-AIR INDIAను విక్రయించేందుకు గత సంవత్సరం డిసెంబర్ లో బిడ్లను ఆహ్వానించగా, టాటా సన్స్, స్పైస్ జెట్ ముందుకు వచ్చాయి.. రెండు బిడ్లను పరిశీలించిన కేంద్ర మంత్రుల బృందం చివరకు టాటా సన్స్‌ వైపే మొగ్గు చూపింది..ఎయిర్‌ ఇండియాను రూ. 18 వేల కోట్లకు టాటా సన్స్ దక్కించుకున్నట్లు కేంద్రం ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపమ్​) కార్యదర్శి తహిన్​ కాంత పాండే శుక్రవారం ప్రకటన చేశారు. దీంతో ఇకపై ఎయిర్‌ ఇండియా విమానాల నిర్వహణ బాధ్యత మొత్తం టాటా సన్స్‌ గ్రూప్‌ చేతుల్లోకి వెళ్లనుంది..ఎయిర్ ఇండియా,,దానికి అనుబంధ సంస్థ అయిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ లో 100 శాతం వాటాను బిడ్ ద్వారా దక్కించుకోవడంతోపాటు… విజేత బిడ్‌లో గ్రౌండ్-హ్యాండ్లింగ్ కంపెనీ- ఎయిర్ ఇండియా సాట్స్ ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (AISATS) లో 50 శాతం వాటాను టాటా సన్స్ బిడ్ లో దక్కించుకుంది..డిసెంబర్‌ నాటికి ఎయిరిండియా టాటా గ్రూప్‌ చేతికి రానుంది. ప్రభుత్వ రంగ సంస్థల వాటాల విక్రయాల్లో ఇదో చారిత్రక ఘట్టంగా మార్కెట్ నిపుణులు అభివర్ణిస్తున్నారు..,2019-20 ఆర్థిక సంవత్సరం లెక్కల ప్రకారం ఎయిర్ ఇండియాకు 38 వేల 366 కోట్ల రూపాయల అప్పు ఉందని కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంటులో తెలిపింది..(ఎయిర్ ఇండియా అసలు పేరు టాటా ఎయిర్ లైన్స్. 1932లో టాటా ఎయిర్ లైన్స్ ను పారిశ్రామిక దిగ్గజం JRD టాటా స్ధాపించగా, స్వాతంత్ర్యం అనంతరం కేంద్ర ప్రభుత్వం దీన్ని జాతీయీకరణ చేసి,దీని పేరును ఎయిర్ ఇండియాగా మార్చింది..68 ఏళ్ల తర్వాత మళ్లీ ఎయిరిండియా టాటా చేతికొచ్చింది..)

 

Spread the love