Recent Posts

C-295 MW మిలటరీ రవాణా విమానాల కొనుగోలుపై కుదిరిన ఒప్పందం

అమరావతిం భారతదేశ సరిహద్దులను నిరంతరం కాపాడే జవాన్లుకు అవసరమైన సామాగ్రిని చేరవేయడంతో పాటు అవసరమైన రక్షణ పరికరాలను క్షణల్లో అందించేందుకు అవసరమైన C-295 MW మిలటరీ రవాణా విమానాలను కొనుగొలు ఒప్పందంపై స్పెయిన్‌కు చెందిన ఎయిర్‌బస్ డిఫెన్స్ అండ్ స్పేస్‌తో భారత రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారం భారీ ఒప్పందం కుదుర్చుకుంది..భారత వాయుసేన రవాణా వ్యవస్థ బలోపేతం చేసేందుకు దాదాపు రూ.22,000 వేల కోట్లతో  56, C-295 MW మిలటరీ రవాణా విమానాలను కొనుగోలు చేయడానికి ఎయిర్‌బస్ తో కాంట్రాక్టుపై సంతకాలు పూర్తయ్యాయని రక్షణ శాఖ ప్రతినిధి భరత్​ భూషణ్​ బాబు తెలిపారు..సుదీర్ఘం కాలం నుంచి పెండింగ్​లో ఉన్న ఈ విమానాల కొనుగోలుకు రెండు వారాల క్రితమే భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది..C-295 MW విమానం..5-10 టన్నుల సరుకును రవాణా చేయగలదు. ఈ విమానాలు.. ప్రస్తుతం వాయుసేనలో సేవలందిస్తున్న అవ్రో-748 విమానాలను భర్తీ చేయనున్నాయి..ఒప్పందంలో భాగంగా ఎయిర్​ బస్​ డిఫెన్స్ 48 నెలల్లోగా 16 రవాణా విమానాలను భారత్​కు అందించనున్నది..మిగిలిన 40 విమానాలను మేకిన్ ఇండియాలో భాగంగా మన దేశంలోనే ఎయిర్‌బస్ డిఫెన్స్ అండ్ స్పేస్, టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ కన్సార్షియం తయారు చేస్తుంది..సైనిక విమానాలను భారతదేశంలో ఒక ప్రైవేట్ కంపెనీ తయారు చేసే తొలి ప్రాజెక్టు ఇదే కావడం గర్వించతగ్గ విషయం..ఈ సందర్భంగా టాటా ట్రస్ట్​ ఛైర్మన్​ రతన్​ టాటా,భారత రక్షణ శాఖకు, ఎయిర్​ బస్​కు శుభాకాంక్షలు తెలిపారు. C-295 MW రవాణా విమానాల తయారీకి టాటా అడ్వాన్సుడ్​ సిస్టమ్స్​, ఎయిర్​బస్​ డిఫెన్స్​ జాయింట్​ ప్రాజెక్టుకు ఆమోదం లభించటం భారత్​లో వైమానిక ప్రాజెక్టుల ప్రారంభానికి గొప్ప ముందడుగుగా పేర్కొన్నారు..ఈ ఒప్పందం భారత్​లో పూర్తిస్థాయిలో విమానాల తయారీని బలోపేతం చేస్తుందన్నారు.గతంలో ఎన్నడూ చేయని విధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో దేశీయ సరఫరా సామర్థ్యాన్ని పెంచుతుందన్నారు..

Spread the love
error: Content is protected !!