Recent Posts

అగ్ని ప్రైమ్ మిస్సైల్ ను పరీక్ష విజయవంతం

అమరావతి: భారతదేశం క్షిపణి పరిజ్ఞానంను రోజు రోజుకు పెంచుకుంటు పోతుంది..తాజాగా అణ్వస్త్ర సహిత అగ్ని ప్రైమ్ మిస్సైల్ ను పరీక్షించింది..ఇది అనుకున్నట్లుగానే లక్ష్యాన్ని ఛేదించడంతో DRDO వర్గాలు సంతోషం వ్యక్తం చేశాయి..అగ్ని ప్రైమ్ క్షిపణి,వాస్తవానికి రెండు ప్రధాన క్షిపణుల శక్తిసామర్థ్యాల కలయిక అని చెప్పుకోవాలి.. అగ్ని-4, అగ్ని-5 క్షిపణుల్లోని టెక్నాలజీ ఉపయోగించి అగ్ని ప్రైమ్ కు తయారు చేశారు.. అగ్ని-1 మిస్సైల్ కంటే ఇది చాలా తక్కువ బరువు ఉంటుంది..ప్రధానంగా అగ్ని ప్రైమ్ షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్..ఎక్కువగా 1,500 కిమీ దూరంలోని లక్ష్యాలను గురితప్పకుండా ఛేదించగలదు..1000 కిమీ దూరం వరకు అణ్వాయుధాలను మోసుకెళ్లగలదు..అగ్ని ప్రైమ్ క్షిపణిని తాజాగా ఒడిశా తీరప్రాంతంలో పరీక్షించగా అన్నివిధాలుగా DRDO నిర్దేశించిన ప్రమాణాలను ఇది అందుకోవడంతో, పరీక్ష విజయవంతం అయినట్టు శాస్త్రవేత్తలు ప్రకటించారు..

Spread the love