Recent Posts

కృష్ణపట్నం పోర్టులో 100 శాతం యాజమాన్య హక్కులను దక్కించుకున్న ఆదానీ గ్రూప్

నెల్లూరు: జిల్లాలోని కృష్ణపట్నం పోర్టు యాజమాన్య హక్కులను 100 శాతం అదానీ పోర్ట్స్‌ సంస్థ దక్కించుకుంది.. 2020లో 75 శాతం వాటాను కొనుగోలు చేసిన అదానీ సంస్థ,,తాజాగా విశ్వ సముద్ర హోల్డింగ్స్‌ నుంచి మరో 25 శాతం వాటాను కొనుగోలు చేసింది..దీంతో 100 శాతం పెట్టుబడులు కలిగిన అదానీకి కృష్ణపట్నం పోర్టు యాజమాన్య హక్కులన్నీ సొంతమయ్యాయి..ఈ మేరకు ఈ సంస్థ సోమవారం ఓ ప్రకటన విడుదల చేస్తు కొనుగోలు చేసిన 25 శాతం వాటా విలువ రూ.2,800 కోట్లుగా తెలిపింది..2020- 21లో పోర్టు మొత్తం విలువ రూ.13,675 కోట్లు ఉన్నట్లుగా అదానీ పోర్ట్సు వెల్లడించింది..ప్రస్తుత హ్యాండిలింగ్‌ సామర్థ్యం 64 మిలియన్‌ టన్నులుగా ఉందని,,దీన్ని 2025 నాటికి 200 నుంచి 300 మిలియన్‌ టన్నులకు పెంచేందుకు ప్రయత్నిస్తామని,,అలాగే ఈ పోర్టును గేట్‌వే ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌గా తయారు చేస్తామని వెల్లడించింది..కృష్ణపట్నం పోర్ట్‌ డీప్‌ వాటర్‌ నౌకాశ్రయం..ఈ పోర్టు వార్షిక సామర్థ్యం 6.4 కోట్ల టన్నులు..మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఈ పోర్టు 3.8 కోట్ల టన్నుల సరకు రవాణా చేసి రూ. 1,840 కోట్ల ఆదాయాన్ని,,ఇందులో రూ. 1,325 కోట్ల నికర లాభాన్ని ఆర్జించే అవకాశం ఉందని భావిస్తున్నారు..సరకు రవాణా సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకోవాలనే తమ లక్ష్యానికి అనుగుణంగా కృష్ణపట్నం పోర్టును పూర్తిగా కొనుగోలు చేసినట్లు అదానీ పోర్ట్స్‌ సీఈవో కరణ్‌ అదానీ పేర్కొన్నారు..ఈ పోర్టు సామర్థ్యాన్ని 50 కోట్ల టన్నులకు విస్తరించే అవకాశం ఉందని తెలిపారు..

Spread the love