Recent Posts

ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరిస్ లో నటించిన నటీ,నటుల పారితోషకాలు!

అమరావతి: ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరిస్ ఓ.టి.టి ప్లాట్ ఫామ్ లో విడుదలై క్రమేణ ప్రేక్షకులు ఆదరణ పొందింది..వీక్షకుల నుంచి స్పందన లభించడంతో డైరెక్టర్లు రాజ్,,డీకేలు రెండవ సీజన్ పై దృష్టి సారించారు..షూటింగ్ పూర్తి అయ్యి విడుదలకు సిద్దమైయ్యే సమాయనికి చిన్నిపాటి వివాదం తలెత్తింది..దింతో సీజ‌న్ 1ను మించి సీజ‌న్ 2 స‌క్సెస్ సాధించింది..కథనంలో శ్రద్ద చూపించడంతో పాటు స‌మంత లాంటి స్టార్ హీరోయిన్ ఇందులో న‌టించ‌డమే..ఈ సీరిస్ లో న‌టించిన న‌టీన‌టుల రెమ్యూన‌రేష‌న్స్ విష‌య‌మై చాలా వార్తలు వస్తున్నాయి..ఎవరు ఎంత రెమ్యూరేషన్ తీసుకున్నారు అనే వివ‌రాల‌లోకి వెళితే,,రెండు సీరిస్ ల‌లో శ్రీకాంత్ తివారిగా న‌టించిన మ‌నోజ్ బాజ్ పాయ్ కు 10 కోట్ల రూపాయ‌ల పారితోషికం ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది..అలానే అత‌ని భార్య సుచిగా న‌టించిన హీరోయిన్ ప్రియ‌మ‌ణికి ఒక్కో సీరిస్ కు 80 ల‌క్ష‌లు చెల్లించినట్లు సమాచారం..అలాగే సీజ‌న్ 2తో త‌మిళ తీవ్ర‌వాది రాజీ పాత్ర‌కు ప్రాణం పోసి అంద‌రి దృష్టినీ త‌న‌వైపు తిప్పుకున్న స‌మంత‌కు 4 కోట్ల వరకు రెమ్యూన‌రేష‌న్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది..ఇక మ‌నోజ్ బాజ్ పాయ్ కుమ‌ర్తె గా నటించిన ఆశ్లేషా ఠాకూర్ కు 50 ల‌క్ష‌ల రెమ్యూన‌రేష‌న్ ఇచ్చార‌ట‌..ఇక ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ధారుల‌లో ష‌రీఫ్ హ‌ష్మీకి 65 ల‌క్ష‌లు, ద‌ర్శ‌న్ కుమార్ కు కోటి రూపాయ‌లు, శ‌ర‌త్ ఖేల్క‌ర్ కు 1.6 కోట్లు, స‌న్నీ హిందూజాకు 60 ల‌క్ష‌లు ఇచ్చార‌న్న‌ది సీని వ్యాపార వ‌ర్గాల నుంచి అందిన సమాచారం..

Spread the love