నెల్లూరు: ఏపీ జెన్కో శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రంలో యాష్ హ్యాండ్ల్లింగ్ హాఫర్ (ESP) ఎలక్ట్రో స్టాటిక్ ప్రేసిపీటేటర్ హాఫర్ శనివారం ఉదయం కూలిపోవడంతో జెన్కోలో విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయింది..శనివారం ఉదయం నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరు థర్మల్ విద్యుత్ కేంద్రంలో ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో అ ప్రాంతంలో దాదాపు 100 డిగ్రీల టెంపరేచర్ ఉంటుంది..ప్రమాదం జరిగిన సమయంలో వర్కర్స్ లేకపోవడంతో ప్రాణహాని తప్పింది.. ప్లాంట్ మొత్తం బూడిద కమ్మేసింది.కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. మొత్తం విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయింది..విద్యుత్తు ఉత్పత్తి ఆగిపోవడంతో కరెంటు సరఫరా అంతరాయం ఏర్పడింది.అసలే వేసవి కాలం కావడం, ఉత్పత్తిఅవుతున్న కరెంటు చాలకపోవడం, ఎక్కువ రేట్లు పెట్టి కరెంటు కొంటున్న ఈ పరిస్థితులలో ఇది మరింత ఇబ్బందులు కలగజేస్తుంది..హాఫర్లు బూడిద ఎక్కువ కావడం, వేడికి ప్రెజర్ ఎక్కువ కావడంతో హాఫర్ కూలిపోయింది. బూడిద తరలింపులో జాప్యం వల్ల, సరైన మెయింటెనెన్స్ లేనందున మేనేజ్మెంట్ కాంట్రాక్టరు కుమ్మక్కు అయినందున ఇది సంభవించిందా అన్న అనుమానలు విద్యుత్ కేంద్రం పరిరక్షణ కమిటీ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు..
More Stories
భవన నిర్మాణాలకు సంబంధించి సిమెంట్ బిల్లులను త్వరగా మంజూరు కు చర్యలు-కలెక్టర్
సచివాలయ సిబ్బంది ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి-కలెక్టర్
ధర్మవరంలో బీజెపీ నాయకులపై దాడి-పలువురికి తీవ్ర గాయాలు