Recent Posts

జిల్లాస్థాయి స్పోర్ట్సు స్కూలు ఎంపికల్లో పాల్గొన్న 106 మంది విద్యార్దిని,విద్యార్దులు

నెల్లూరు: జిల్లాస్థాయి స్పోర్ట్సు స్కూలు ఎంపికలు శుక్రవారం స్థానిక ఏ.సి సుబ్బారెడ్డి స్పోర్ట్సు కాంప్లెక్స్ రెండవ రోజు పూర్తి చేయడం జరిగిందని జిల్లా సెట్నల్,క్రీడాప్రాధికార సంస్థ సి.ఇ.ఓ పుల్లయ్య తెలిపారు.గురువారం,శుక్రవారం నిర్వహించిన బ్యాటరీ పరిక్షల్లో నెల్లూరు,కావలి,ఆత్మకూరు డివిజన్స్ నుంచి రెండవ రోజుతో కలిపి మొత్తం 106 మంది విద్యార్దిని,విద్యార్దులు హాజరు అయ్యారన్నారు.బ్యాటరీ పరీక్షలైన శరీరం ఎత్తు,బరువు,30మీ ఫ్లైయింగ్ స్టార్ట్,6X10 మీ,షటిల్ రన్,మెడిసిన్ బాల్ ఫట్,800మీ పరుగు జరిగాయన్నారు.ఈ ఎంపికల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఈనెల 27,28 తేదిల్లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ,గుంటూరులో జరుగబోవు రాష్ట్ర స్థాయి ఎంపికల్లో పాల్గొనవలసి వుంటుందన్నారు.రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరచిన విద్యార్దిని,విద్యార్దులకు కడపజిల్లా పుట్లంపల్లిలోని ఏ.పి స్పోర్ట్సు స్కూలుతో చేర్చుకొని వారికి ఉచిత వసతి చదువుతో పాటు భావి క్రీడాకారులుగా తీర్చిదిద్దులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు.

Spread the love
error: Content is protected !!