Recent Posts

ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన తెలుగు బిడ్డ

అమరావతి: టోక్యో ఒలింపిక్స్ లో భారత షట్లర్ పివీ సింధు బ్యాడ్మింటన్ లో పతకం సాధించి చరిత్ర సృష్టించింది.కాంస్య పతకం కోసం జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా ఆడిన సింధు తన ఖాతాలో మరో ఒలింపిక్ మెడల్ వేసుకుంది. చైనా ప్లేయర్ హి బింగ్జియావోతో జరిగిన మ్యాచ్ లో వరుసగా రెండు సెట్లలో గెలిచిన సింధు,మువ్వనెల జెండాను రెపరెపలాడించింది. ఫస్ట్ గేమ్ ను 8 పాయింట్ల తేడాతో అలవోకగా గెల్చుకున్న సింధు, రెండో సెట్‌లో కొద్దిగా కష్టపడింది.అయితే 6 పాయింట్ల తేడాతో ఈ సెట్‌లో కూడా నెగ్గి రెండు ఒలింపిక్ మెడల్స్ గెలిచిన తొలి భారత మహిళా క్రీడాకారిణీగా రికార్డు క్రియేట్ చేసింది. శనివారం జరిగిన సెమీస్‌లో వరల్డ్‌ నెంబర్‌ వన్‌ తై జు యింగ్‌ చేతిలో ఓడిన సింధు,అదివారం ఎలాంటి పొరపాట్లకు ఆవకాశం లేకుండా తనదైన శైలిలో ఆపెన్స్ గేమ్ అడింది..కోర్టు మొత్తం కలియతిరుగుతూ పూర్తి ఎనర్జీతో, మంచి ఫుట్‌వర్క్‌ తో ప్రత్యర్దికి కోలుకునే ఆవకాశం ఇవ్వకుండా ఆడింది.చివరి వరకు అదే ఊపును కొనసాగించి రెండో సెట్‌ను కైవసం చేసుకొని కాంస్యంతో మెరిసింది. 

Spread the love