Recent Posts

రూ.50 లక్షలు చెల్లిస్తే గవర్నమెంట్​ మెడికల్​ కాలేజీలో సీట్​

అమరావతి: వైద్య విద్య ప్రవేశాలకు దేశవ్యాప్తంగా నిర్వహించే నీట్ ఎంట్రెన్స్ లో భారీ కుంభకోణం వెలుగు చూసింది.. రూ.50 లక్షలు చెల్లిస్తే,ఇతర వ్యక్తులతో ఎగ్జామ్​ రాయిస్తామని,దింతో మీకు గవర్నమెంట్​ మెడికల్​ కాలేజీలో సీట్​వచ్చేలా చేస్తామంటూ మహారాష్ట్రలోని ఓ కోచింగ్​ సెంటర్​ పలువురు అభ్యర్థులతో ఒప్పందం చేసుకున్నట్లు సీబీఐ దర్యాప్తులో బయటపడింది..ఈ మేరకు కోచింగ్​ సెంటర్ ​డైరెక్టర్ సహా పలువురు స్టూడెంట్స్​ను అదుపులోకి తీసుకున్నట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి..కేసు పూర్వపరాలు ఇలా వున్నాయి..మహారాష్ట్రలో​ని RK Education Career Guidance నీట్ ​స్టూడెంట్స్​కు కోచింగ్​ నిర్వహిస్తోంది..గవర్నమెంట్ ​మెడికల్ ​కాలేజీలో సీట్ వచ్చేలా చేస్తామని,,అభ్యర్థులు రూ.50 లక్షల చొప్పున చెల్లించాలని కోచింగ్ ​సెంటర్​ డైరెక్టర్ ​పరిమల్​ కొత్పల్లివార్ ​పలువురు స్టూడెంట్స్​తో ఒప్పందం చేసుకున్నాడు.. ​సీటు అలాట్ అయిన తరువాతే డబ్బులు మొత్తం ఇచ్చేలా పోస్ట్​ డేటెడ్​ చెక్​లు ఇవ్వాలని కోరాడు..ఎగ్జామ్​  ఆన్​లైన్​లో కాబట్టి యూజర్​ ఐడీ, పాస్​వర్డ్, ఆధార్ ​వివరాలు ఇస్తే,,నకిలీ ఐడీ కార్డులు సృష్టించి ఇతర అభ్యర్థులతో పరీక్ష రాయిస్తామని చెప్పాడు..ఒక వేళ అలా కుదరకపోతే ఎగ్జామ్ ​టైంలో ఆన్సర్​ షీట్​ఇవ్వడం గానీ, OMR​ మార్చడం కానీ చేస్తామని అగ్రిమెంట్ చేసుకున్నాడు.అసలు స్టూడెంట్స్​కు బదులుగా మొత్తం అయిదుగురు ఇతర వ్యక్తులు ఎగ్జామ్​కు అటెండ్​ అయ్యేలా నకిలీ ఐడీ కార్డులు సిద్దం చేసుకున్నారు..సమాచారం సీబీఐ అధికారులకు అందడంతో ఎగ్జామ్ ​సెంటర్​లోనే నిందితులను రెడ్​హ్యాండెడ్​గా పట్టుకోవాలని ప్లాన్​ వేశారు.ఈ నెల 12న నీట్​ఎగ్జామ్​ రోజు సెంటర్ల వద్ద సీబీఐ అధికారులు కాపుకాచారు..సెంటర్ వాళ్లకు ఏదో అనుమానం రావడంతో,వాళ్లు ఎగ్జామ్​కు హాజరుకాలేదు..విషయం పసికట్టిన సీబీఐ అధికారులు సంబంధిత కోచింగ్​సెంటర్​లో సోదాలు చేసి,వివరాలు సేకరించడంతో పాటు నిందితులను అరెస్ట్​ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీబీఐ వర్గాలు పేర్కొన్నారు..

Spread the love