Recent Posts

కొత్త తరం యువకులు రాజకీయాల్లోకి రావలి-పవన్

హైదరాబాద్: కొత్త తరం యువకులు రాజకీయాల్లోకి రావలని,అలాంటి వారు తెలంగాణ అసెంబ్లీలో ప్రజల తరపున గొంతు విన్పించాలన్నారు.. శనివారం తెలంగాణ‌లో జ‌న‌సైనికుల‌తో ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌మావేశం ఏర్పాటు చేశారు..ఈ స‌మావేశంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. 2009 లో తెలంగాణ‌లో సంపూర్ణంగా తిరిగాన‌ని,త‌న‌ను దెబ్బ‌కొట్టేకొద్దీ మ‌రింత ఎదుగుతాన‌ని తెలిపారు.అన్నింటికీ సిద్ధ‌ప‌డే రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన‌ట్టు తెలిపారు.ఈ నేల త‌న‌కు ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని,బ‌ల‌మైన సామాజిక మార్పుకోసం ప్ర‌య‌త్నిస్తాన‌ని అన్నారు.తెలంగాణ ప్ర‌జ‌లు కోరుకున్న‌ప్పుడు తాను త‌ప్ప‌కుండా ప్ర‌జ‌ల ప‌క్షాన పోరాటం చేస్తాన‌ని అన్నారు.తెలంగాణ‌లోని యువ‌త‌కు అవ‌కాశాలు క‌ల్పించాల‌ని, ప్ర‌జ‌ల ప‌క్షాన నిల‌బ‌డి పోరాటం చేసే వ్య‌క్తులు అసెంబ్లీకి వెళ్తే చూడాల‌ని ఉంద‌ని, త‌ప్ప‌కుండా జ‌న‌సేన ఆ క‌ల‌ను నిజం చేసి చూపిస్తుంద‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ తెలిపారు.త‌న‌కు, డ‌బ్బు ప‌ద‌వులు అవ‌స‌రం లేద‌ని, స‌మాజిక మార్పు కోరుకునే వ్య‌క్తిని అని ప‌వ‌న్ తెలిపారు. ప్ర‌జ‌ల నుంచి దండుకునే డబ్బు త‌న‌కు అవ‌స‌రం లేద‌ని,ప్ర‌జ‌లు ఏమి ఇవ్వాలి అనుకున్నా వాటిని సినిమా ద్వారా సంపాదించుకుంటాన‌ని అన్నారు.

Spread the love