Recent Posts

ఈనెల 21 నుంచి జాతీయ స్థాయి పర్యవేక్షక బృందం క్షేత్రస్థాయిలో పర్యాటన-జె.సి  

నెల్లూరు: జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, పనితీరును పరిశీలించేందుకు ఈనెల 21వ తేదీ నుంచి 27 వరకు జాతీయ స్థాయి పర్యవేక్షక బృందం పర్యటించనున్నట్లు జాయింట్ కలెక్టర్ హరేంధిరప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం తిక్కన ప్రాంగణంలో జాతీయ స్థాయి పర్యవేక్షక బృందం సభ్యులు సురంజన్ రెడ్డి,శాంతకుమార్ తో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎంపిక చేసిన పది గ్రామాల్లో ఈ బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి ఉపాధి హామీ, మంత్రి ఆవాస్ యోజన, దీన్ దయాల్ అంత్యోదయ యోజన, సామాజిక పింఛన్లు తదితర కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలను సేకరించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందని పేర్కొన్నారు.డిఆర్డిఎ పిడి సాంబశివారెడ్డి మాట్లాడుతూ సంబంధిత శాఖల అధికారులందరూ బృంద సభ్యులకు పూర్తిస్థాయిలో సహకరించి అవసరమైన అన్ని రికార్డులను సిద్ధం చేసుకోవాలని పేర్కొన్నారు. ఐదురోజుల పర్యటనలో అల్లూరు, దగదర్తి, సీతారామపురం మండలాల పరిధిలో రోజుకు రెండు గ్రామాల చొప్పున కేంద్ర బృందం పర్యటిస్తుందని ఆయన వెల్లడించారు.ఈ సమావేశంలో డిపిఓ శ్రీమతి ధనలక్ష్మి, డ్వామా పిడి  తిరుపతయ్య, సర్వే ల్యాండ్స్ ఏడి హనుమాన్ ప్రసాద్, పంచాయతీరాజ్ ఎస్ఇ సుబ్రహ్మణ్యం, హౌసింగ్ పిడి వేణుగోపాల్, డీఎస్ఓ వెంకటేశ్వర్లు, అల్లూరు, దగదర్తి, గూడూరు ఎంపీడీవోలు నాగేష్ కుమారి,  కళాధర రావు, నాగమణి, డిఆర్డిఎ ఎపివో సోమయాజులు, ఏపీఎం మస్తాన్ తదితర అధికారులు పాల్గొన్నారు.

Spread the love