Recent Posts

అప్ఘానిస్తాన్ లోని షియాల మసీదులో భారీ పేలుడు,100 మంది మృతి

అమరావతి: అప్ఘానిస్తాన్ లోని తాలిబన్ల పాలనలో మరోసారి భారీ పేలుడు సంభవించింది..కుందుజ్ ఫ్రావిన్స్ లోని మసీదులో శుక్రవారం ప్రార్థనల అనంతరం శక్తి వంతమైన పేలుడు జరిగిందని సీనియర్ తాలిబన్ అధికారి ఒకరు తెలిపారు..ఈ పేలుడు ధాటికి దాదాపు 100 మంది వరకు ప్రాణాలు కోల్పోగా,మరికొందరు గాయపడ్డారని తెలిపారు. ఖాన్ అబాద్ ప్రాంతంలోని షియాల మసీదును లక్ష్యంగా చేసుకుని దుండగలు ఈ దాడికి పాల్పపడినట్లు ప్రత్యక్ష సాక్షలు తెలిపినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది..జరిగిన సంఘటనపై తాలిబన్ల అధికార ప్రతినిధి జాబిహుల్ల ముజాహిద్ స్పందిస్తు,,షియాలను లక్ష్యంగా చేసుకుని దాడి జరిగిందని చెప్పారు..తాలిబన్ల ప్రత్యేక బలగాలు సంఘటన స్థలంకు చేరుకుని దర్యప్తు జరుపుతున్నయని వెల్లడించారు.

Spread the love