Recent Posts

కాందహార్ మసీదులో భారీ పేలుడు 33 మంది మృతి

అమరావతి: షియా ముస్లింలే లక్ష్యంగా ఆఫ్ఘనిస్థాన్‌లో ఉగ్రవాదులు బాంబు పేలుళ్లు, ఆత్మాహుతి దాడులు కొనసాగిస్తున్నారు.షియా ముస్లింలు ప్రార్థనలు నిర్వహించే మసీదుల్లో ఆత్మాహుతి దాడులకు పాల్పడడం ద్వారా వందల సంఖ్యలో ప్రాణాలు తీస్తూ రక్తపాతం సృష్టిస్తున్నారు.శుక్రవారం దక్షిణ ప్రావిన్స్‌లోని పోలీస్ డిస్ట్రిక్ట్-1 (పీడీ-1) సమీపంలో ఇమామ్ బార్గా మసీదులో భారీ పేలుడు సంభవించింది.ప్రత్యక్ష్య సాక్షుల కథన మేరకు మసీదు ద్వారా వద్ద ఓ వ్యక్తి తనను తాను పేల్చుకోగా,మరో ఇద్దరు డిటోనేటర్స్ పేల్చివేశారు..దింతో దాదాపు 33 మంది మరణించగా,మరో 73 మంది వరకు గాయపడ్డారని తెలిపారు.ప్రాణ నష్టం ఇంకా ఎక్కువ అయ్యే అవకాశలు ఉన్నాయని లోకల్ పోలీసులు రాయిటర్స్ వార్త సంస్థ రిపొర్టర్ కు తెలిపారు.ఈ నెల 8న ఉత్తర ఆఫ్ఘనిస్థాన్‌లో షియా ముస్లింలే లక్ష్యంగా ఓ మసీదులో జరిగిన ఆత్మాహుతి దాడిలో 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటన నుంచి తేరుకోకముందే ఈసారి కాందహార్ బాంబు దాడితో దద్దరిల్లింది.

Spread the love
error: Content is protected !!