AMARAVATHICRIME

వైసీపీ ఎం.పి బీదా, కుమారై చేసిన కారు యాక్సిడెంట్ తో రోడ్డు ప్రక్కన నిద్రిస్తున్న వ్యక్తి మృతి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ ఎంపీ బీద మస్తాన్ రావు కుమార్తె మాధురి(33) సోమవారం సాయంత్రం చెన్నైలో ఓ వ్యక్తిపై తన కారును నడిపడంతో,,సదరు యువకుడు గాయాలతో మరణించాడు.. ఎంపీ బీద మస్తాన్ రావు కుమార్తె మాధురిను చెన్నై పోలీసులు మంగళవారం అరెస్టు చేసి స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు.. బాధితుడు పెయింటర్ గా పనిచేస్తున్న సూర్య(24)గా పోలీసులు గుర్తించారు..ఇతనికి 8 నెలల క్రిందటే వివాహాం అయినట్లు తెలుస్తొంది.. సోమవారం రోజువారి కూలీ పనులు తరువాత చెన్నైలోని బీసెంట్ నగర్ ప్రాంతంలోని పేవ్‌మెంట్ సమీపంలో మద్యం తాగి రోడ్డు పక్కన పడుకున్నాడు.. మాధురి, ఆమె స్నేహితురాలు ప్రయాణిస్తున్న BMW కారు,రోడ్డు ప్రక్కన నిద్రిస్తున్న సూర్యపై నుంచి దూసుకెళ్లింది..ప్రమాదం జరిగిన వెంటనే మాధురి కారు నుంచి దిగి వెళ్లిపోయారని బాధితుడి బాధువులు పేర్కొన్నారు..ప్రమాదం జరిగిన శబ్దాలకు స్థానికులు వెంటనే సంఘటాన స్థలానికి చేరుకున్నారు..
వారితో అదే కారులో వున్న మాధురి స్నేహితురాలు, స్థానికులతో వాగ్వాదానికి దిగింది.. సూర్యను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్‌ కి ఫోన్ చేశామని ఆమె వారికి చెప్పింది.. స్థానికులు ఆందోళనకు దిగడంతో అమె కూడా అక్కడి నుంచి వెళ్లిపోయారు.. వారు అంబులెన్స్‌ కు కాల్ చేసిన నంబర్‌ను ఉపయోగించి ఎంపీ కుమార్తె మాధురి,ఆమె స్నేహితురాలిని ట్రాక్ చేసినట్లు చెన్నై J-5 శాస్త్రినగర్ పోలీసు అధికారులు మీడియాకు తెలిపారు.. కారు పుదుచ్చేరిలో రిజిస్టర్ అయినట్లు కూడా గుర్తించామన్నారు..
సూర్య భార్య వినీత ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 304 (ఎ) (నిర్లక్ష్యం వల్ల మరణం) కింద కేసు నమోదు చేశారు.. తదనంతరం, మాధురిని పోలీసులు మంగళవారం అరెస్టు చేసి స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *