Recent Posts

అంతరిక్ష ప్రయోగాల్లో కీలక మలుపు-ప్రవేట్ శాటిలైట్స్ ప్రయోగాలు

అమరావతి: దేశంలో రూపొందించిన పూర్తిస్థాయి ప్రైవేటు ఉపగ్రహాన్ని తొలిసారి భారత భూభాగం నుంచి ప్రయోగించనున్నారు.బెంగళూరుకు చెందిన పిక్సెల్‌ అనే అంకుర సంస్థ పూర్తి స్థాయిలో ఓ ప్రైవేటు ఉపగ్రహాన్ని తయారు చేసింది.ఉపగ్రహాన్ని డిసెంబర్ నెలలో ప్రయోగించనున్నట్లు సమాచారం..శాటిలైట్ ను గత సంవత్సరమే ప్రయోగించాల్సి వుండగా,కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడుతూ వస్తోంది..   అమెరికా కాలిఫోర్నియాలోని వాండెన్‌బర్గ్‌ వైమానిక స్థావరం నుంచి స్పేస్‌ఎక్స్‌ రాకెట్‌ ద్వారా భారత్ 2018లోనే తొలి ప్రైవేటు ఉపగ్రహాన్నిఅంతరిక్షంలోకి  ప్రయోగించారు. దేశంలోని ఓ ప్రైవేటు సంస్థ పూర్తి స్థాయిలో రూపొందించి భారత భూభాగం నుంచి ప్రయోగించనున్న భారత తొలి ప్రైవేటు శాటిలైట్‌ మాత్రం తమదేనని పిక్సెల్‌ అధినేత అహ్మద్‌ పేర్కొన్నారు..తమ ఉపగ్రహాన్ని రష్యా నుంచి నింగిలోకి పంపాలనుకున్నామని, అయితే ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహిస్తామన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో తమ నిర్ణయాన్ని మార్చుకున్నామని ఆయన వెల్లడించారు..

Spread the love
error: Content is protected !!