Recent Posts

ఇంటి పైప్ లైన్ లో అవినితి సొమ్మును దాచిన ప్రభుత్వ ఇంజినీరు

ఏసిబి దాడులు..

అమరావతి: అవినీతి సొమ్ముకు ఆలవాటు పడిన ఓ ఇంజినీర్,,ఆక్రమంగా సంపాదించిన సొమ్మును తన ఇంటిలోని పైప్ లైన్ లో దాచిపెట్టిన ఉదంతం అవినితి నిరోధక శాఖ జరిపిన దాడుల్లో బయట పడింది..వివరాల్లోకి వెళ్లితే,, రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తు,అవినితి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై అనిశా, చేపట్టిన సోదాల్లో భాగంగా కల్బుర్గి జిల్లాలోని PWD J.E (జాయింట్ ఇంజనీర్) శాంతగౌడ్ బిరాదార్ నివాసంపై దాడులు చేసినట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు తెలిపారు..సదరు ఇంజినీరు పైపులైన్‌లో నగదు దాచినట్లు సమాచారం రావడంతో,,ఒక ప్లంబర్‌​ సాయంతో పైప్‌లైన్‌ల కట్ చేసి అందులో దాచివుంచిన కరెన్సీ నోట్లను తీశామని అధికారులు వెల్లడించారు..పైప్ లైన్ లో సుమారు రూ.25 లక్షల నగదు, భారీ మొత్తంలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.అవినితి నిరోధక శాఖ నిర్వహిస్తున్న దాడులపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మాట్లాడుతూ” రాష్ట్ర ప్రభుత్వం అవినీతిని ఏ రూపంలోనూ సహించదు. వినీతి నిరోధక శాఖ ఇచ్చే నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం వారిపై తగిన చర్యలు తీసుకుంటుంది” అని చెప్పారు..

Spread the love
error: Content is protected !!