ఆదివారం చిట్యాల (తూర్పుగోదావరి) 48.3°C నమోదు
రోహిణి కారై ప్రారంభం..
అమరావతి: ఎండలు రికార్డు స్థాయికి చేరుకున్న నేపధ్యంలో రాష్ట్రంలో నిప్పుల గుండంగా మారింది. ఆదివారం (మే 24) ఈ సీజన్లోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో 3 రోజుల పాటు ఇదే తీవ్రత కొనసాగే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఆదివారం చిట్యాల (తూర్పుగోదావరి) 48.3°C (ఈ సీజన్లోనే అత్యధికం) నమోదు అయిందని పేర్కొంది.
మే 25వ తేది నుంచి రోహిణి కారై ప్రారంభం కానున్నది. జూన్ 8వ తేదిన మృగశిర కారై వచ్చే వరకు ఈ ఎండలు తప్పవు.
మోస్తరు వర్షాలు కురిసే అవకాశం:- ద్రోణి ప్రభావంతో మార్కాపురం, ప్రకాశం,కర్నూలు,నంద్యాల, అనంతపురం,చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి-మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మన్యం,అల్లూరి, పోలవరం, అనకాపల్లి, మిగిలిన రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

