మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్
అమరావతి: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు.. నరసరావుపేట ఎస్పీ ఆఫీస్ కు ఆయనను తరలించారు.. EVMల ధ్వంసం, అడ్డుకున్నవారిపై దాడి కేసులో పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేయడంతో పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు.. పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్లపై గతంలో ఇచ్చిన తీర్పును ఇవాళ డిస్మిస్ చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.. ఎన్నికల అల్లర్లకు సంబంధించి ఈ కేసులు నమోదయింది.. EVMలను ధ్వంసం చేసిన కేసులో టీడీపీ ఏజెంట్‌పై దాడి చేసిన ఘటనలో పిన్నెల్లిపై హత్యాయత్నం కేసు నమోదయింది.. కారంపూడిలో దాడి కేసులో సీఐ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పిన్నెల్లి బ్రదర్స్ పై మరో హత్యాయత్నం కేసు నమోదయింది..ఇవి కాకుండా EVMలను ధ్వంసం చేసిన ఘటనలో మరో కేసు నమోదయింది. మొత్తం నాలుగు కేసులు ఆయనపై ఉన్నాయి.