ఏ.పి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యణ్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కల్యాణ్ బుధవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు.. ఇందుకు సంబంధించిన అధికారిక పత్రాలపై ఆయన సంతకం చేయడంతో డీప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించినట్టయింది.. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి విజయవాడ చేరుకున్న ఆయన క్యాంపు కార్యాలయంలోకి ఉప ముఖ్యమంత్రిగా తొలిసారి అడుగు పెట్టారు.. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన బాధ్యతలు స్వీకరించారు.. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన పవన్‌కు అభినందనలు వెల్లువెత్తున్నాయి.. పలు శాఖల అధికారులతో పాటు నాగబాబు అభినందనలు తెలిపారు.. పవన్ కల్యాణ్ ఈ రోజే పలు శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహించనున్నారు.