AMARAVATHIDISTRICTS

జిల్లా వ్యాప్తంగా పింఛన్ల పంపిణీలో పాల్గొన్న 8,500 ఉద్యోగులు-మంత్రి నారాయణ

జిల్లాలో 313757మంది లబ్ధిదారులకు రూ. 214.50 కోట్లు..

నెల్లూరు: రాష్ట్రవ్యాప్తంగా సోమవారం తెల్లవారుజామున నుంచి సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరగనుందని పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ వెల్లడించారు.ఆదివారం నగరంలోని స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమం వివరాలను అధికారులు అడిగి తెలుసుకున్నారు.అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ రేపు తెల్లవారుజాము 6 గంటల నుండి సామాజిక పింఛన్లు పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానున్నదని పేర్కొన్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారని తెలిపారు.మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మందికి ఈ సామాజిక పింఛన్లు అందజేయనున్నట్టు వివరించారు. మొదటి రోజే పూర్తిస్థాయిలో పింఛన్లను పంపిణీ చేసేందుకు అధికారులు సమాయత్తమయ్యారన్నారు.ఎన్నికల ముందు ప్రకటించిన విధంగా 3వేలు ఉన్న సామాజిక పింఛన్లు 4 వేలకు పెంచడమే కాకుండా ప్రకటించిన నాటి నుండి ఏప్రిల్ మే జూన్ నెలలకు సంబంధించి వెయ్యి రూపాయలు చొప్పున రూ.3 వేల రూపాయలతో మొత్తం రూ.7000 రూపాయలు ఇవ్వనున్నట్టు మంత్రి పేర్కొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *