Recent Posts

టిబెట్‌ వద్ద 5G కమ్యూనికేషన్‌ సిగ్నల్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేసిన నక్క జిత్తుల చైనా

అమరావతి: నక్కల జిత్తుల చైనా,,నిరంతం భారత్‌పై అక్కసు వెళ్లగక్కుతూ విస్తరణవాద కాంక్షతో రగిలిపోతు భారత్‌ సరిహద్దుల సమీపంలోని టిబెట్‌ వద్ద 5G కమ్యూనికేషన్‌ సిగ్నల్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేసింది..గన్‌బాల రాడార్‌ స్టేషన్‌లో భాగంగా ప్రపంచంలో అత్యంత ఎత్తులో (5,374 మీటర్లు) ప్రారంభించింది..ఇది భారత్‌, భూటాన్‌ బోర్డర్‌కు సమీపంలో టిబెట్‌లోని నగార్జే కౌంటీలో ఇది ఉంది..గత సంవత్సరం పలు సంస్థలతో కలిసి ఇక్కడ 5G స్టేషన్‌ను ఏర్పాటు చేసే కార్యక్రమం చేపట్టింది..సరిహద్దులోని చైనా రక్షణ దళాలకు కమ్యూనికేషన్‌లో సమస్యలను తొలగించేందుకు దీనిని ఉపయోగించనున్నారు..ఈ స్టేషన్ నుంచి దట్టమైన పర్వతాల్లో ఉన్నా సైనికులకు స్పష్టమైన సిగ్నళ్లను చైనా అందించగలుగుతుంది..భారత్‌తో వివాదం కొనసాగుతున్న సమయంలో సరిహద్దుల వెంబడి భారీస్థాయిలో ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ నెట్‌వర్క్‌ ను ఏర్పాటు చేసే పనిలో శరవేగంగా పావులు కదపడం చైనా మొదలుపెట్టి,, ఉద్రిక్తతలు అధికంగా ఉన్న పాంగాంగ్‌ సరస్సులోని దక్షిణ భాగం వరకు కేబుళ్లను వేసేందుకు అప్పట్లో భారీ ఎత్తున తవ్వకాలు ప్రారంభించింది..ఈ విషయాన్ని భారత సైనిక అధికారులు ధ్రువీకరించారు. ”వేగవంతమైన సమాచారం కోసం భారత సరిహద్దుల్లో చైనా గగనతల రక్షణ వ్యవస్థలను గతంలో మోహరించింది. భారత దళాలు వీటిపై ఓ కన్నేసి పెట్టాయని ఆంగ్ల వార్త సంస్థ ANI పేర్కొంది..HQ,,HQ 22 వంటి గగనతల రక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేసింది..ఇప్పటికే HQ 9 కూడా ఇక్కడ ఉంచినట్లు వార్తలొచ్చాయి..ఇది S-300 చైనా తయారు చేసిన నకలు. దీని రేంజి 250 కిలోమీటర్లు..వీటిపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచినట్లు మన సైనిక వర్గాలు వెల్లడించాయి..దీంతోపాటు హోటాంగ్‌,, కష్గర్‌లోని చైనా వాయుసేన స్థావరాల్లో విమానాల రాకపోకలను గమనిస్తున్నాయి..చైనా ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ వేయడం ఆందోళన కలిగించే విషయమే..ఈ కేబుళ్ల ద్వారా సరిహద్దుల్లోని దళాలకు వెనుకనున్న సైనిక స్థావరాల నుంచి వారికి సురక్షితమైన సమాచారం అందుతుంది.. అలాగే ఎప్పటికప్పుడు వీడియోలను,,డాక్యుమెంట్లను పంపించుకోవచ్చు.. ”రేడియో ఫ్రీక్వెన్సీలో  మాట్లాడితే దొరికిపోవచ్చు,,అదే ఆప్టికల్‌ ఫైబర్‌తో అలాంటి పరిస్థితి ఉండదు..సమాచారం సురక్షితంగా ఉంటుంది” అని ఆ అధికారి పేర్కొన్నారు..

Spread the love