Recent Posts

పెట్రోల్ ధరలు తగ్గించేందుకు అత్య‌వ‌స‌ర నిల్వల నుంచి 50 ల‌క్ష‌ల బ్యారెళ్లు?

అమరావతి: దేశంలో చ‌ముదు ధ‌ర‌లను అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొంత మేర వ్యాట్ ను తగ్గించింది.. అయినప్పటికి చమురు ధరలు పెద్దగా తగ్గలేదు..దింతో కేంద్రం మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకోబుతున్న‌ట్టు స‌మాచారం. చ‌మురు ధ‌ర‌ల‌ను క‌ట్ట‌డి చేసేందుకు అమెరికా, జ‌పాన్ లాంటి అనేక దేశాలు అత్యవసర నిల్వల నుంచి కొంత మొత్తం చమురును మార్కెట్ కు తరలిస్తారు..దింతో చమురు ధరలు తగ్గుతాయి…ఇండియా కూడా ఇలాంటి వ్యూహాన్ని అమ‌లు చేయ‌బోతున్న‌ట్టు స‌మాచారం.భార‌త్‌కు నార్త్‌, ఈస్ట్ తీరాల్లో చ‌మురు నిల్వ కేంద్రాలు ఉన్నాయి..అత్య‌వ‌స‌ర స‌మ‌యాల్లో ఇక్క‌డి నుంచి ముడి చ‌మురును బ‌య‌ట‌కు తీసి వినియోగిస్తుంటారు.ఈ వ్యూహాత్మ‌క చ‌మురు నిల్వ కేంద్రాల్లో దాదాపు 3.8 కోట్ల బారెళ్ల ముడి చ‌మురును నిల్వ‌చేస్తారు..వ‌చ్చే వారం ప‌ది రోజుల్లో ఈ చ‌మురు నిల్వ కేంద్రాల నుంచి దాదాపు 50 ల‌క్ష‌ల బ్యారెళ్ల ముడి చ‌మురును బ‌య‌ట‌కు తీసే యోచ‌న‌లో కేంద్ర ప్ర‌భుత్వం ఉన్న‌ట్టు స‌మాచారం..ఈ చమురును మంగుళూరులోని ఎంఆర్‌పీఎల్‌, హెచ్‌పీసీఎల్‌కు త‌ర‌లించ‌నున్నార‌ని స‌మాచారం..ఈ రెండు సంస్థలు, అత్యవసర నిల్వల కేంద్రాలతో లింక్ అయివుంటాయి..ఇలా బయటకు తీసిన చమురు మార్కెట్ లో వస్తే,,ధరలు తగ్గుతాయి..

Spread the love
error: Content is protected !!