Recent Posts

జమ్ముకాశ్మీరులో 5గురు ఉగ్రవాదులు హతం

అమరావతి: ఉగ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పులు 5 మంది జవాన్లు అమరు కావడంతోకూబింగ్ ముమ్మరం చేసిన సైన్యం,జమ్మూకశ్మీర్‌లో పలు ప్రాంతాల్లో ఐదుగురు ఉగ్రవాదులను ఏరివేశారు..మంగళవారం షోపియాన్ జిల్లాలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య  కాల్పులు చోటు చేసుకోగా,ఇందులో లష్కరే తోయిబా అనుభంద సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ కు చెందిన ముగ్గురు టెర్రరిస్టులు హతమయ్యారు..వీరిలో ఒకరిని ముఖ్తార్ షాగా భద్రతా దళాలు గుర్తించాయి. వీరి దగ్గర నుంచి భారీ స్థాయిలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు.అలాగే ఫీరిపోరాలో మరో ఇద్దరు టెర్రరిస్టులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి.ఉగ్రవాదుల వేట ఇంకా కొనసాగుతున్నట్లు పోలీసు అధికారులు పేర్కొన్నారు..

Spread the love