Recent Posts

రాష్ట్ర వ్యాప్తంగా 18 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు 6 నెలల్లో మీటర్లను బిగించాలి-పెద్దిరెడ్డి

అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా 18 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ లకు సంబంధించి ఆరు నెలల్లో విద్యుత్ మీటర్లను అమర్చడాన్ని పూర్తి చేయాలని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డిస్కం అధికారులను ఆదేశించారు. అలాగే రైతులు వినియోగించుకున్న విద్యుత్ కు చెల్లించాల్సిన సొమ్మును ప్రభుత్వమే భరిస్తూ ఆ సబ్సిడీ మొత్తాలను రైతుల ఖాతాలకే నేరుగా డెబిటి కింద జమ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని అన్నారు. అందుకోసం రైతులతో ఈ నెలాఖరు నాటికి బ్యాంకు ఖాతాలను ప్రారంభించే ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. సచివాలయంలో సోమవారం విద్యుత్ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, విద్యుత్ మీటర్ల ఏర్పాటు వల్ల వ్యవసాయానికి నికరంగా రైతులు ఎంత మేరకు విద్యుత్ ను వినియోగించుకుంటున్నారో ఖచ్చితమైన వివరాలు తెలుస్తాయని అన్నారు..2021-22 ఆర్థిక సంవత్సరంలో శ్రీకాకుళం జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్ గా 28వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ లకు మీటర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు..2020-21 ఆర్థిక సంవత్సరంలో ఇదే జిల్లాలో 26 వేల వ్యవసాయ కనెక్షన్ లకు గానూ 101.51 మిలియన్ యూనిట్ల విద్యుత్ ను వినియోగించుకున్నారని డిస్కంలు లెక్కలు వేశాయని తెలిపారు..దాని ప్రకారం విద్యుత్ సబ్సిడీని ప్రభుత్వం చెల్లించిందని అన్నారు.అయితే ఇదే జిల్లాల్లో విద్యుత్ మీటర్లను భిగించిన తరువాత 2021-22 ఆర్థిక సంవత్సరానికి 28వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ లకు గానూ 67.76 మినియన్ యూనిట్ల విద్యుత్ ను వినియోగించినట్లు నిర్థిష్టంగా గుర్తించడం జరిగిందని అన్నారు. అంటే మీటర్లు భిగించడం వల్ల నికరంగా ఎంత విద్యుత్ ను వ్యవసాయం కోసం వినియోగిస్తున్నారో తేలిందని, గత ఏడాదితో పోలిస్తే రెండు వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ లు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా 33.75 మిలియన్ యూనిట్ల విద్యుత్ తక్కువగానే వినియోగించినట్లు గుర్తించడం జరిగిందన్నారు. ఈ మేరకు మాత్రమే ప్రభుత్వం వ్యవసాయ విద్యుత్ సబ్సిడీని డిస్కం లకు చెల్లించిందని, దీనివల్ల ప్రభుత్వం వినియోగించకపోయినా కూడా సరైన లెక్కలు తేలకపోవడం వల్ల ఇప్పటి వరకు వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ పేరుతో చేస్తున్న అదనపు చెల్లింపులకు చెక్ పెట్టడం జరిగిందని వివరించారు.

Spread the love
error: Content is protected !!