Recent Posts

రామమందిర నిర్మాణం కోసం వచ్చిన విరాళాల్లో 15 వేల చెక్కులు బౌన్స్

అమరావతి: అయోధ్య రామమందిర నిర్మాణం కోసం విరాళాలుగా ఇచ్చిన చెక్కులు 15 వేల చెక్కులు బౌన్స్‌ అయ్యాయి.. వాటి మొత్తం విలువ దాదాపు రూ.22 కోట్లకు పైగానే ఉన్నట్లు తెలింది.. అయోధ్య రామమందిరం నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆడిట్‌లో ఈ విషయం బయటపడింది..బ్యాంకు ఖాతాల్లో నిధులు లేకపోవడం,, చెక్కులపై సంతకాలు సరిపోలకపోవడం వంటి సాంకేతిక కారణాలతో చెక్కులు బౌన్స్ అయ్యాయి..ఈ చెక్కుల విషయమై ట్రస్ట్ కమిటీ బ్యాంకులతో సంప్రదిస్తోందని,, ఇబ్బందులను తొలగించేవిధంగా ప్రయత్నిస్తోందని ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రా తెలిపారు..చెక్కులు చెల్లకపోవడంతో బ్యాంకు అధికారులు,,వారికి మరో అవకాశం ఇస్తుందని,,తప్పులు సరిచేసి చెక్కులు అందజేసేందుకు అవకాశం కల్పిస్తుందని ఆయన చెప్పారు..బౌన్స్ అయిన చెక్కుల్లో అయోధ్య నుంచి వచ్చినవే సుమారు 2 వేల వరకూ ఉన్నాయని ట్రస్టు ట్రెజరర్ స్వామి గోవింద్ దేవ్ గిరి తెలిపారు.. మిగిలిన 13 వేల చెక్కులు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చాయని,,చెల్లని చెక్కులను తిరిగి వారికే పంపి,,కొత్త చెక్కులు పంపాలని కోరనున్నట్లు గిరి వెల్లడించారు..

Spread the love