Recent Posts

11 క్రీడాకారులకు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు

అర్జున్ అవార్డులకు 35 మంది..

అమరావతి: భారతదేశ అత్యున్నత క్రీడా అవార్డు అయిన మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుకు 11 మంది అథ్లెట్లను జాతీయ క్రీడా అవార్డుల కమిటీ బుధవారం సిఫార్సు చేసింది..టోక్యో ఒలింపిక్స్ 2020తో పాటు టోక్యో పారాలింపిక్స్ 2020లో పలువురు అథ్లెట్లు దేశం గర్వపడేలా చేశారు. పారాలింపిక్స్‌ లో రెండు పతకాలు సాధించిన మొదటి భారతీయ మహిళగా  పారాలింపియన్ అవనీ లేఖరా కూడా ఖేల్ రత్న అవార్డుకు ఎంపికైంది. పారాలింపిక్స్ 2020 లో F64 పారా జావెలిన్ త్రోలో గోల్డ్ మెడల్ ను సొంతం చేసుకున్న సుమిత్ యాంటిల్ పేరును ఖేల్ రత్నకు ప్రతిపాదించారు. వీరితోపాటు 35 మంది భారత అథ్లెట్లు అర్జున అవార్డుకు  సిఫార్సు చేశారు.గతంలో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుగా వ్యవహరించే వారు, ప్రస్తుతం ఈ అవార్డును ప్రధాని మోడీ లెజెండరీ హాకీ ఆటగాడు మేజర్ ధ్యాన్ చంద్ పేరుతో మార్పు చేశారు..ఖేల్ రత్న అవార్డుకు సిఫార్సు చేసిన అథ్లెట్లు:-నీరజ్ చోప్రా (జావెలిన్‌),,రవి దహియా (రెజ్లింగ్),,పీఆర్ శ్రీజేష్ (హాకీ),,లోవ్లినా బోర్గోహై (బాక్సింగ్),,సునీల్ ఛెత్రి (ఫుట్‌బాల్),,మిథాలీ రాజ్ (క్రికెట్),,ప్రమోద్ భగత్ (బ్యాడ్మింటన్),,
సుమిత్ ఆంటిల్ (జావెలిన్),,అవని ​​లేఖరా (పారాలింపియన్),,కృష్ణా నగర్ (బ్యాడ్మింటన్),,ఎం.నర్వాల్ (షూటింగ్)..

Spread the love
error: Content is protected !!