6 సిరిస్‌తో ప్రారంభం కానున్న జియో సేవలు

0
430

ముంబై: రిలయన్స్ జియోలో కొత్తగా చేరే కస్టమర్స్ కు ‘6’సిరీస్ తో మొదలయ్యే నంబర్స్ ను కేటాయించనున్న‌ట్లు స‌మాచారం. రిలయన్స్ ‘6’సిరీస్ ప్రతిపాదనకు టెలికాం శాఖ కూడా ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తోంది. అయితే తొలిదశలో కొన్ని సర్కిల్స్ లో మాత్రమే ఈ ‘6’సిరీస్ నంబర్లు అందుబాటులోకి రానున్నాయి.రాజస్థాన్, తమిళనాడు, అసోం రాష్ట్రాల్లో తొలుత ఈ సేవలు అందుబాటులోకి రానున్నట్టు సమాచారం. రాజస్థాన్ లో60010-60019 ఎంఎస్సీ(మొబైల్ స్విచ్చింగ్ కోడ్), అసోం-60020 – 60029, తమిళనాడు-60030 – 60039 ఎంఎస్సీలో ఎంఎస్సీలో కనెక్షన్లను జారీ చేయనున్నట్టు సంస్థ తెలిపింది. తెలుగు రాష్ట్రాలకు ఇప్పట్లో ఈ ‘6’సిరీస్ నంబర్స్ అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. కాగా, మధ్యప్రదేశ్, గుజరాత్‌ రాష్ట్రాలకు ‘7’ సిరీస్‌ను, కోల్‌కత్తా, మహారాష్ట్రకు ‘8’ సిరీస్‌లోనూ జియో నంబర్లను కేటాయించనుంది రిలయన్స్.

LEAVE A REPLY