స్మార్ట్‌ఫోన్స్‌ను శ‌క్తివంత‌మైన స్కానర్స్‌గా మార్చివేసే టూల్‌-అడోబ్‌స్కాన్‌

0
619

అమ‌రావ‌తిః స్మార్ట్‌ఫోన్స్‌ను శ‌క్తివంత‌మైన స్కానర్స్‌గా మార్చివేసి టూల్‌ను,, అడోబ్ సంస్థ Adobe Scan పేరుతో సూపర్ ఫాస్ట్ స్కానింగ్ యాప్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది.ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవటం ద్వారా తమ ఫిజికల్ డాక్యుమెంట్లను మరింత క్వాలిటీతో డిజిటల్ ఫైల్స్‌గా మార్చుకుని అడోబ్ క్లౌడ్ అకౌంట్‌లో భద్రపరచుకోవచ్చ. అడోబ్ స్కాన్ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌లను సపోర్ట్ చేస్తుంది.మార్కెట్లో లభ్యమవుతోన్న ఇతర మొబైల్ డాక్యుమెంట్ స్కానింగ్ యాప్‌లతో పోలిస్తే అడోబ్ స్కాన్ యాప్ ప్రొఫెషనల్ స్థాయి పనితీరును కనబరుస్తుంది.యాప్‌లో నిక్షిప్తం చేసిన అడోబ్ సెన్స్‌సీ అనే అడ్వాన్సుడ్ ఇమేజ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ మనం స్కానం చేసే డాక్యుమెంట్‌లకు సంబంధించిన అంచులను ఆటోమెటిక్‌గా గుర్తిస్తుంది. అంతేకాకుండా ఫోటోలను ఆటో క్రాప్ చేయటం, ఫోటోలోని నీడను తొలగించటం, టెక్స్ట్‌‌ను మరింత షార్ప్‌గా చూపించటం వంటి జాగ్రత్తలను ఈ యాప్ తీసుకుంటుంది.ఒక్క మాటలో చెప్పాలంటే Adobe Scan యాప్‌తో స్కాన్ చేసే డాక్యుమెంట్స్ మరింత క్లియర్‌గా ఉంటాయి. గూగుల్ ప్లే,యాపిల్ ఐఓఎస్ స్టోర్ లలో అందుబాటులో ఉన్న ఈ యాప్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. Adobe ఐడీని క్రియేట్ చేసుకోవటం ద్వారా యాప్ వర్క్ అవుతుంది.

LEAVE A REPLY