పోటీదారుల‌కు చుక్కలు చూపిస్తున్న జియో బంఫ‌ర్ ఆఫ్‌ర్‌

0
506

ముంబైః సెల్‌ఫోన్ సేవాలందిస్తున్న కంపెనీల మ‌ధ్య జియో దెబ్బ పోటీ నువా నేనా అన్న‌ట్లు పోటీ మ‌రి రేట్లు,టారిఫ్‌లంటు ఆఫ‌ర్‌ల మీద ఆఫర్‌లు అందిస్తున్నారు.కంపెనీలు ప్ర‌క‌టించే ఆఫ‌ర్స్‌తో వినియోగ‌దారుడు త‌బ్బిఉబ్బిలుతున్నాడు.సెల్‌ఫోన్ ఇంట‌ర్‌నెట్ వాడ‌కం జియోకు ముందు జియో త‌రువాత అని చెప్ప‌కునే ప‌రిస్థితి వ‌చ్చింది.గతంలో 1 జిబి డేటా కోసం దాదాపు 175 రూపాయ‌లు ఖ‌ర్చ చేయాల్సి వ‌చ్చేది.అయితే జియో రంగ ప్ర‌వేశంతో ఈ మొత్తం 99 రూపాయ‌ల ప‌డిపోయింది,అది కూడా రోజుకు 1 జిబి వంతున 28 రోజుల‌కు దాదాపు 28 జిబీ వ‌స్తుంది. రిలయన్స్ జియో తన ఖాతాదారులకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఉచిత డేటా, ఉచిత వాయిస్ కాలింగ్ సదుపాయాల నుంచి టారిఫ్ లలోకి ప్రవేశించిన జియో ఇప్పుడు ‘ప్రైమ్ మెంబర్ షిప్’ను కూడా ఉచితంగా ఒక పథకాన్ని తన యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ వినియోగదారులకు రూ.99 ల రుసుముతో ప్రైమ్ మెంబర్ షిప్ ద్వారా ప్రస్తుతం పొందుతున్న సేవలన్నీ మార్చి 2018 వరకు ఉచితం. అయితే జియో మనీ ద్వారా ఇప్పుడొక ప్రత్యేక ఆఫర్ లో ఈ ‘ప్రైమ్ మెంబర్ షిప్’ కూడా ఉచితంగా పొందే అవకాశాన్ని కల్పించింది. ఎలాగంటే… 15 మార్చి 2017 నుండి ప్రారంభమైన ఈ ఆఫర్ పరిమిత కాలానికే అందుబాటులో ఉంది. జియో మనీ లేదా మై జియో యాప్ లేదా www.jio.com లోకి లాగిన్ అయి రూ.99 మరియు రూ.303 చెల్లించాలి. అంటే.. మొత్తంగా మీరు రూ.402 చెల్లిస్తారు. అనంతరం యాప్ లో రూ.50 డిస్కౌంట్ వోచర్ లభిస్తుంది. ఈ వోచర్ ను రూ.303 లు, ఆపైన విలువ గల తరువాతి రీచార్జ్ సమయంలో వినియోగించుకోవచ్చు.ఈ ఆఫర్ మార్చి 25 నుంచి జూన్ 30 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ పరిమిత కాలంలో వినియోగదారులు 5 సార్లు ఇలా రీచార్జ్ లావాదేవీ నిర్వహించుకోవచ్చు. ఈ పరిమిత కాలంలో ఎప్పుడైనా ఇలా రెండుసార్లు రీచార్జ్ చేసుకునే సమయంలో రూ.50 చొప్పున నగదు వెనక్కి వస్తుంది. దీంతో ముందుగా చెల్లించిన రూ.99 .. మీకు తిరిగి వచ్చేసినట్లే. ప్లాన్స్.. ఆఫర్స్.. ఇలా రూ.303 ప్లాన్ లో.. ప్రైమ్ మెంబర్స్ కు అయితే 30 జీబీ హైస్పీడ్ డేటా, నాన్ ప్రైమ్ యూజర్లకు 2.5 జీబీ డేటా లభిస్తుంది. వ్యాలిడిటీ మాత్రం ఇరువురికీ 28 రోజులే. ఇక రూ.499 ప్లాన్ లో అయితే వ్యాలిడిటీ 28 రోజులే ఉంటుంది కానీ.. ప్రైమ్ మెంబర్స్ కు 58 జీబీ హైస్పీడ్ డేటా, నాన్ ప్రైమ్ యూజర్లకు 5 జీబీ డేటా లభిస్తుంది. రూ.999 రీచార్జ్ పై ప్రైమ్ మెంబర్స్ కు 60 జీబీ హైస్పీడ్ డేటా, నాన్ ప్రైమ్ యూజర్లకు 12.5 జీబీ డేటా లభిస్తుంది. దీని వ్యాలిడిటీ 60 రోజులు.. అంటే రెండు నెలలు. ఇక రూ.1999 ప్లాన్ లో 90 రోజుల కాల పరిమితితో ప్రైమ్ మెంబర్స్ కు125 జీబీ హైస్పీడ్ డేటా, నాన్ ప్రైమ్ యూజర్లకు 30 రోజుల వ్యాలిడిటీతో 30 జీబీ డేటా లభిస్తుంది.

LEAVE A REPLY