తురియా సెల్‌ఫోన్‌లు ఇండియాలో బ్యాన్‌

0
399

సెక్యూరీటి ఫిచ‌ర్లు ఇండియా స్టాండ‌ర్డ్‌కి స‌రిప‌డ లేవు అనే ?  కార‌ణంతో ? యూఏఈకి చెందిన తురియా కంపెనీ శాటిలైట్ ఫోన్ లను భారత్ ప్రభుత్వం బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించింది. దేశంలో తురియా (Thuraya) కంపెనీ చెందిన ఫోన్‌లు గానీ, ఇరిడియం (Iridium) కంపెనీ ఫోన్లుగానీ కనిపిస్తే వెంటనే సీజ్ చేయాలని అన్ని రాష్ట్రాల పోలీసు అధికారులకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.ఇందుకు సంబంధించి కువైట్ లోని భారతీయ ఎంబసీ కూడా విదేశీయులను ఉద్దేశించి ఓ ప్రకటనను జారీ చేసింది. వీదేశీయులు ఎవరూ భారత్‌కు తరుయా కంపెనీ వైర్‌లెస్ శాటిలైట్ ఫోన్‌లను తీసుకురాకూడదని సూచించింది. ఈ ఫోన్‌లను భారత్‌లో బ్యాన్ చేయటానికి గల కారణాలు వెల్లడికావల్సి ఉంది.యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కేంద్రం కార్యకలాపాలు సాగిస్తోన్న తురియా కంపెనీ 1997లో ప్రారంభించారు. ఈ ప్రాంతీయ మొబైల్ శాటిలైట్ ఫోన్ ప్రొవైడర్ 162 పై చిలుకు దేశాల్లో మొబైల్ కవరేజ్‌ను ప్రొవైడ్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 350 మంది రోమింగ్ పార్టనర్‌లను కలిగి ఉన్న తురియా కంపెనీ ల్యాండ్ బేసిడ్ మొబైల్ జీఎస్ఎమ్ నెట్ వర్క్ప్ పై రోమింగ్ సేవలను అందిస్తోంది. జీఎస్ఎమ్ అలానే ఉపగ్రహ సామర్థ్యాలతో కూడిన డ్యుయల్ మోడ్ శాటిలైట్ ఫోన్‌లను కూడా తురియా విక్రయిస్తోంది.

LEAVE A REPLY