గిజ గిజ‌లాడుతున్న ఎయిర్‌టెల్ ?

0
393

గ‌త సంవత్స‌రం .జియో మార్కెట్‌లోకి ప్ర‌వేశించే వ‌ర‌కు ఎయిర్‌టెల్ వినియోగ‌దారుల జేబుల‌కు బాగా చిల్లులు పెట్టేది.అలాగే క‌స్ట‌మ‌ర్ రెస్ప్ పాన్స్ అంతంత మాత్రంగా వుండేది.ఎయిర్‌టెల్ ప‌ట్ల వినియోగ‌దారుల్లో ఒక ర‌క‌మైన ఆసంతృప్తి ఉన్న‌ప్ప‌టికి వేరే దారి లేక అదే నెట్‌వ‌ర్క్‌లో కొన‌సాగుతుంద‌డే వారు.జియో రంగ ప్ర‌వేశంతో ఎయిర్‌టెల్‌కు గుక్క‌తిప్ప‌కొలేని దెబ్బ త‌గిలింది.దింతో జియో దెబ్బకు దేశ నంబర్ వన్ టెలీకాం కంపెనీ అయిన భారతీ ఎయిర్‌టెల్ లాభాలు భారీగా పడిపోయాయి. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఎయిర్‌టెల్ లాభం 55 శాతం పడిపోయింది. జియో ఉచిత సర్వీసుల వల్ల వాయిస్, డాటా బిజినెస్‌లో తీవ్రంగా నష్టపోయామని ఎయిర్‌టెల్ ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో రూ.504 కోట్ల లాభం మాత్రమే వచ్చినట్లు ఎయిర్‌టెల్ వెల్లడించింది.గత నాలుగేళ్లలో ఎయిర్‌టెల్‌కు ఇదే అతితక్కువ లాభం. గతేడాది ఇదే మూడో త్రైమాసికంలో ఎయిర్‌టెల్ రూ. 1,108 కోట్ల లాభాలు ఆర్జించింది. డాటా, వాయిస్ ప్లాన్ రేట్లు పడిపోవడం, చాలా మంది వినియోగదారులు ఎయిర్‌టెల్ నుంచి బయటికి వెళ్లిపోవడంతో కంపెనీ ఆదాయం కూడా 3 శాతం పడిపోయింది. ఈ త్రైమాసికంలో ఎయిర్‌టెల్ రూ. 23,335 కోట్ల ఆదాయాన్ని పొందింది.

LEAVE A REPLY