రైతుల కోసం స‌మీక్షలా ? మిగిలి వున్న నిధుల కోస‌మా ?- కాకాణి

ఏవ‌రి కోసం..అమ‌రావ‌తిః ముఖ్య‌మంత్రి,మంత్ర‌లు చేస్తున్న స‌మీక్ష‌లు,ఏవ‌రికోసం,ఎందుకోసం చేస్తున్న‌ర‌ని ysrcp నెల్లూరుజిల్లా అధ్య‌క్ష‌డు కాకాణి.గోవ‌ర్ద‌న్‌రెడ్డి ప్ర‌శ్నించారు.గురువారం హైదరాబాద్‌లోని ysrcp కేంద్ర కార్య‌ల‌యంలో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో అయ‌న మాట్లాడుతూ వీళ్లు చేస్తున్న‌ సమీక్షలు ఎవరో అడ్డుకుంటున్నట్లు చంద్రబాబు డ్రామాలాడుతున్నారని మండిప‌డ్డారు.40 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు,మంత్రులు క‌నీస అవ‌గాహ‌న లేకుండా మాట్లాడుతున్నార‌న్నారు.మంత్రులు మాట్లాడే భాషా వారి దిగ‌జారుడు త‌నంకు నిద‌ర్శ‌మ‌ని,,ఇందుకు ఇటీవ‌ల వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి,, సమీక్షిస్తా..‘‘ఎవరూ అడ్డువస్తారో చూస్తా..లేదంటే రాజీనామా చేస్తా..కాదంటే సుప్రీంకోర్టుకు వెళ్తా’’ అని వ్యాఖ్యలు చేశారని .. దేనిమీద సమీక్ష చేయాలనుకుంటున్నారో స్పష్టత లేని పరిస్థితి ఉందని మండిపడ్డారు. రైతులు పండిచే ఫలసాయంపై మంత్రి సోమిరెడ్డికి దృష్టి ఉంటుంది తప్ప..వ్యవసాయం మీద కాదన్నారు. జూన్‌ 1 నుంచి ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం అవుతుందన్న విషయం చంద్రబాబుమోహన్‌రెడ్డికి తెలియదా..అంటు ప్రశ్నించారు.ఈ సీజన్‌కు సంబంధించి జనవరిలోనే యాక్షన్‌ ప్లాన్‌ తయారుచేసుకుంటారన్నారని, సైక్లోన్‌ రివ్యూ పేరుతో చివరి అవకాశంగా భావించి నిధులు దొరికితే దిగమింగాలని ఆలోచనతో సమీక్ష చేస్తున్నారని విమర్శించారు.ఐదు సంవత్సరాలు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉందని,రెండు సంవత్సరాలు సోమిరెడ్డి మంత్రిగా పనిచేశారని,ఖరీఫ్‌లో 347 మండలాలు,రబీలో 250 మండలాలను కరువు మండలాలుగా డిక్లేర్‌ చేశారని,అధికారంలో ఉన్నపుడు ఎటువంటి సమీక్షలు జరిపి రైతులకు ఏవిధంగా అండగా ఉన్నాడో మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు రైతుల సమస్యలు గుర్తుకురాలేదు కాని నేడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ధాన్యం కొనుగోలు గురించి మాట్లాడుతున్నారంటు ఎద్దేవా చేశారు.