జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు-ర‌మ‌ణదీక్షితులు

0
81

అమ‌రావ‌తిః తనకు న్యాయం జరుగుతుందన్ననమ్మకం ఉందని,అలాగే స్వామి వారి ఆభరణాలు కాపాడటం నా ధర్మం,, నాకు జరిగిన అన్యాయంపై పోరాడేందుకు ఎవరినైనా కలుస్తానని,ఇందులో భాగంగానే వైసీపీ అధినేతను కలిశానని తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు చెప్పారు. గురువారం మధ్యాహ్నం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని హైదరాబాదులో కలుసుకున్నారు.ఆయనతో దాదాపు ఇరవై నిమిషాల పాటు భేటీ అనంతరం ఆయన ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడారు. ఇక్కడకు తన కష్టాలు చెప్పుకోవడానికి వచ్చానని ఆయన వ్యాఖ్యానించారు.తనకు జరిగిన అన్యాయాన్నిజగన్‌కు వివరించానని చెప్పారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి తనకు జరిగిన అన్యాయంపై వివరించాలని ప్రయత్నించానని కానీ కలిసేందుకు అవకాశం ఇవ్వలేదని చెప్పారు.ఇక్కడ నేనేమీ రాజకీయాలు చేయడం లేదని,తాను గతంలో చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని వెల్లడిచారు.జగన్‌ను కలిసి తనకు జరిగిన అన్యాయం చెప్పి న్యాయం చేయాలని కోరానని,ఆయన తనకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని చెప్పారు.మిరాశీ వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత తన పైన ఉందన్నారు.నా మీద విచారణ జరిపితే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని,నా కష్టాలు ఎవరు వింటే వారికి చెబుతానన్నారు. సమస్యలు వినేందుకు తమకు ఏ పార్టీ అయితే ఏమిటన్నారు.

LEAVE A REPLY