చంద్రబాబునాయుడు సంపాదించినదంతా విదేశాల్లో దాస్తున్నారు-మోత్కుప‌ల్లి

0
148

అమ‌రావ‌తిః చంద్రబాబునాయుడు సంపాదించినదంతా విదేశాల్లో దాస్తున్నారంటూ తెలంగాణ‌ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు.గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబునాయుడు సంపాదించినదంతా దుబాయ్,సింగపూర్,అమెరికాలో దాస్తున్నారని,అయ‌న‌ సంపాదించిన ఆస్తులపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు.చంద్రబాబుపై సీబీఐ ఎంక్వయిరీ కనుక జరిపితే కచ్చితంగా ఎంత సంపాదించారో బయటకొస్తుందన్నారు. బాబు రాజ్యసభ సీట్లను అమ్ముకుంటావా? రాజ్యసభ సీటు ఇస్తానని నువ్వు నాకు ప్రామిస్ చేయలేదా? ఈ సీటును టీజీ వెంకటేష్ కు వంద కోట్లకు నువ్వు అమ్ముకోలేదూ? సీఎం రమేష్ దగ్గర నువ్వు తీసుకున్నావా లేదా? గరికపాటి మోహన్ రావుకు నువ్వు డబ్బులు తీసుకోకుండా ఇచ్చావా? నేను వాళ్లను తప్పబట్టడం లేదన్నారు.నువ్వు వేలం వేశావు.. వాళ్లు కొన్నారు. వేలం వేస్తామని బోర్డు పెడితే కొనుక్కోకుండా ఎవరుంటారు? అంటు మోత్కుపల్లి ప్రశ్నల వర్షం కురిపించారు.చంద్రబాబు కొడుకు లోకేష్ రాజకీయ వ్యాపారం పెట్టారని తీవ్రమైన ఆరోపణలు చేశారు.రాజకీయాలను వ్యాపారం చేసిన ఘనత ఒక్క చంద్రబాబునాయుడిదేన‌ని,ఒక దళితుడిగా దీనిని తీవ్రంగా ఖండిస్తునన్నారు.

LEAVE A REPLY