పవన్,జగన్‌లు స్వంతంగా తమజెండాను ఏర్పాటు చేసుకున్నమొగాళ్ళు-మోత్కుప‌ల్లి

0
72

చంద్రబాబునాయుడుకు నల్లపేజీ ఉంటుంది.
అమ‌రావ‌తిః పవన్ కళ్యాణ్, వైఎస్ జగన్‌లు స్వంతంగా తమ జెండాను ఏర్పాటు చేసుకొన్నారని,వాళ్ళు మొగ్గాళ్ళని,ఎన్టీఆర్ నుండి చంద్ర‌బాబు టిడిపి జెండాను లాక్కొన్నారని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు తీవ్రంగా విమర్శించారు.సోమ‌వారం ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని హైద్రాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద మోత్కుపల్లి నర్సింహులు ఆయన ఘనంగా నివాళులర్పించారు.అనంతరం ఆయన ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్రబాబునాయుడుపై తీవ్రమైన ఆరోపణలు చేశారు.ఏపీలో బాబుకు ఓటెయొద్దని,అవసరమైతే తాను ఏపీలో కూడ రధయాత్ర చేస్తానని మోత్కుపల్లి నర్సింహులు చెప్పారు.కులాల మధ్య చిచ్చుపెట్టారని,మాల,మాదిగల మధ్య బాబు చిచ్చుపెట్టారని ఆరోపించారు.కాపులు,బీసీల మధ్య కూడ చిచ్చు పెట్టారని, కాపులకు రిజర్వేషన్లు ఎప్పుడు ఇస్తారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.కెసిఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు చంద్రబాబునాయుడు కుట్ర చేశారని,ఓటుకు నోటు కేసులో చంద్రబాబునాయుడుపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ సీఎం కెసిఆర్‌ను మోత్కుపల్లి డిమాండ్ చేశారు.చంద్రబాబునాయుడు వల్లే ఎన్టీఆర్ మరణించారని, అయ‌న‌ చావుకు కూడ చంద్రబాబే కారణమని,ఎన్టీఆర్ నుండి పార్టీ జెండాను లాక్కొన్నారని విమర్శించారు.రాష్ట్ర రాజకీయ చరిత్రలో చంద్రబాబునాయుడుకు నల్లపేజీ ఉంటుందని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. ఎన్టీఆర్ వల్ల తనలాంటి పేదోళ్ళు రాజకీయాల్లోకి వచ్చారని ఆయన చెప్పారు.రాజ్యసభ సీటును ఏపీ సీఎం చంద్రబాబునాయుడు రూ.100 కోట్లకు అమ్ముకొన్నారని, పోలవరం ప్రాజెక్టులో కూడ వందల కోట్లను కమిషన్లుగా తీసుకొన్నారని ఆరోపించారు.హోదాపై యూటర్న్ తీసుకొని ఇప్పుడు హోదా గురించి బాబు మాట్లాడుతున్నారని ఆయన విమర్శలు చేశారు. చంద్రబాబునాయుడును ప్రజలు పాతాళంలోకి తొక్కేందుకు సిద్దంగా ఉన్నారని,బాబుకు ఓటు వేయొద్దని ఆయన కోరారు.తన రాజకీయ జీవితాన్ని బలి తీసుకోవడానికి కుట్రలకు పాల్పడ్డారన్నారు.

LEAVE A REPLY