దేవాదేవుడి విలువ రూ 100 కోట్ల ?

0
51

అమ‌రావ‌తిః ఏడుకొండ‌ల‌వాడి పరువును తీశానని ఆరోపిస్తూ రూ.100 కోట్లు చెల్లించాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తనకు నోటీసులు పంపించారని,కోటాన కోట్ల‌ మంది కొలిచే,తమ ఇష్టదైవంగా పూజించే కలియుగ దేవదేవుని పరువు విలువ రూ. 100 కోట్లని ఎలా లెక్కగడతారని ర‌మ‌ణ దీక్షితులు ప్రశ్నించారు. బుధ‌వారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ ప్ర‌పంచంలో ఏవరు వెలకట్టలేని స్వామికి వెలకట్టిన ఘనత ప్ర‌సుత్తం టిటిడిలో ప‌నిచేస్తున్న‌ అధికారులకే దక్కిందని నిప్పులు చెరిగారు.తాను చేసిన ఆరోపణలపై నిష్పక్షపాతమైన విచారణ జరిపాల్సిందిపోయి,తనకు నోటీసులు పంపించ‌డం ఏమిట‌ని ప్రశ్నించారు.స్వామివారికి వైఖానస ఆగమ శాస్త్ర పద్ధతుల్లో అన్ని కార్యక్రమాలూ జరుగుతున్నాయని భక్తులకు నమ్మకం కలిగించే చర్యలు ఎక్కడ తీసుకున్నారని అడిగారు.ఆరాధనలు, అభిషేకాలు,అలంకారాలు, నైవేద్యాలు సరిగ్గా జరుగుతున్నాయని నిరూపించుకోవాలని డిమాండ్ చేసిన రమణ దీక్షితులు,స్వామివారి ఆస్తులను,దివ్యమైన తిరువాభరణాలు భద్రమని నిరూపించుకోవాలని కోరారు.నిరూపించుకున్న తరువాత తన ఆరోపణలు అసత్యమైనవిగా అనిప్పిస్తే, తనపై పరువు నష్టం దావా వేసుకోవచ్చని,తన ఆరోపణలపైనే రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేయడం టీటీడీకి నగుబాటని, అధికారులకు ఈ సలహా ఇచ్చిన వ్యక్తిని చాలా పెద్ద బృహస్పతిగా భావిస్తున్నానని ఎద్దేవా చేశారు.

LEAVE A REPLY