అక్కడికే వెళ్లి ఓట్లు వేయించుకోండి-గిరిజ‌నులు

0
116

అమ‌రావ‌తిః ఎన్నిక‌ల ప్ర‌చారం చేసేందుకు వ‌స్తున్నటీఆర్ఎస్ అభ్యర్థులకు ప్రజల నుంచి నిరసనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.బుధ‌వారం భద్రాద్రి జిల్లాలోని ఆశ్వారావుపేటలో ప్రచారానికి వెళ్లిన తెరాస అభ్యర్థి, ట్రైకార్‌ ఛైర్మన్‌ తాటి వెంకటేశ్వర్లుకు గ్రామగ్రామానా నిరసనలు వెల్లువెత్తాయి. ఆయన్ను గ్రామాల్లోకి రానీయకుండా గిరిజనులు అడ్డుకున్నారు.ఆయన మండలంలోని రంగాపురం, మేకలబండ, గుమ్మడవల్లి, ఖమ్మంపాడు, కోయ రంగాపురం తదితర గ్రామాల్లో పర్యటించారు. అక్కడి గిరిజన మహిళలు తాటి వెంకటేశ్వర్లును నిలదీశారు. తమ గ్రామానికి ఏం చేశారో చెప్పాలని.. తమ భూములు లాక్కున్నా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.దీంతో ఆయన నందిపాడు,బచ్చువారి గూడెం గ్రామాల్లో రెండు పడక గదుల ఇళ్లు నిర్మించామని చెప్పగా అక్కడికే వెళ్లి ఓట్లు వేయించుకోమని నిష్కర్షగా చెప్పారు.

LEAVE A REPLY