టీటీడికి స‌మ‌న్లు జారీచేసిన హైకోర్టు

0
77

అమరావ‌తిః టీటీడీలో నెలకొన్న వివాదాలపై మంగ‌ళ‌వారం హైకోర్టులో విచారణ జరిగింది.గుప్త నిధుల కోసం తవ్వకాలు,నగల మాయం, ఆదాయ వ్యయాలు తదితర అంశాలకు సంబంధించిన ఆరోపణలపై సీబీఐ చేత విచారణ జరిపించాలంటూ వేసిన పిల్‌ను కోర్టు విచారించింది. ఈ సందర్భంగా టీటీడీ ఈవో,రాష్ట్ర దేవాదాయ శాఖలకు నోటీసులు జారీ చేస్తు,3 వారాల్లోగా పూర్తి వివరాలతో కూడిన ప్రమాణపత్రం దాఖలు చేయాలని ఆదేశించింది.గుంటూరు జిల్లాకు చెందిన అనిల్ కుమార్,గుజరాత్ కు చెందిన భూపేందర్ గోస్వామి అనే ఇద్దరు వ్యక్తులు గతంలో ఈ పిల్‌ను దాఖలు చేసి,సీబీఐ విచారణ జరిపించాలని వారు కోరారు.

LEAVE A REPLY