తెలంగాణ గవర్నర్ తమిళి సైను కలిసిన చిరంజీవి

అమరావతి: తెలంగాణ గవర్నర్ తమిళి సైను ప్రముఖ హీరో చిరంజీవి కలిశారు. హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో ఈరోజు ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు. దసరా పండగను పురస్కరించుకుని ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆమెకు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా తాను నటించిన ‘సైరా’ చిత్రాన్ని చూడాలని ఆమెను కోరారు. అందుకు, ఆమె సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. బ్రిటిష్ రాజు కు వ్యతిరేకంగా పోరాంటం చేసిన స్వాతంత్ర్య సమరయోధుని జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించామని తమిళిసైకి చిరంజీవి వివరించారు.