తెలంగాణ‌లో 15 స్దానాలకు టీడీపీ అభ్య‌ర్దులు!

0
111

అమ‌రావ‌తిః తెలంగాణాలోమ‌హాకుట‌మికి సంబంధించి పార్టీలు త‌మ అభ్య‌ర్దుల లిస్ట్‌ను దాదాపు త‌యారు చేసుకున్న‌ట్లు స‌మాచారం అందుతుంది.టీటీడీపీకి చెందిన నాయకుల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఈ నియోజకవర్గాల్లో సైకిల్ పార్టీ నాయకులు పోటీ చేయనున్నారు. అయితే వీటిలో వనపర్తిలో చిన్నారెడ్డి బరిలో దిగడం – రాజేంద్రనగర్ స్థానాన్ని కూడా టీడీపీ కోరుకోవడం కాంగ్రెస్ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నట్లు సమాచారం. ఈ రెండు స్థానాల కోసం ఆ పార్టీ నేతలు పట్టుపడుతున్నట్లు తెలుస్తోంది. తాజా చర్చల్లో ఈ సీట్లపై చర్చలు ఫలిస్తే పేర్లు ఖరారు కావచ్చునని అంటున్నారు.తెలుగుదేశం పార్టీనేతలు తాము పోటీ చేసేందుకు సిద్ధమైన స్థానాలు ?
1.శేర్లింగంపల్లి- భవ్య ఆనంద్ ప్రసాద్,,2.కుకట్పల్లి- పెద్ది రెడ్డి,,3.ఉప్పల్- వీరేంద్ర గౌడ్,,4.కుత్భుల్లాపూర్ -అరవింద్ కుమార్ గౌడ్ లేదా కూనా వెంకటేష్ గౌడ్,,5.రాజేంద్రనగర్- గణేష్ గుప్తా లేదా సామా భూపాల్ రెడ్డి,,6.జూబ్లీహిల్స్ – అనూష రామ్ లేదా ప్రదీప్ చౌదరి,,7.ఖమ్మం – నామా నాగేశ్వరరావు,,8.సత్తుపల్లి – సండ్ర వెంకట వీరయ్య,,9.అశ్వరావు పేట – మచ్చ నాగేశ్వరరావు,,10.మక్తల్ – కొత్త కోట దయాకర్‌రెడ్డి,,11.దేవరకద్ర – సీతాదయాకర్‌రెడ్డి,,12.జడ్చర్ల – ఎర్ర శేఖర్,,13.వనపర్తి – రావుల చంద్రశేఖర్ రెడ్డి,,14.నిజామాబాద్ రూరల్ -మండవ వెంకటేశ్వర రావు,,15.కోరుట్ల – ఎల్ రమణలు దాదాపు ఖ‌రారు కావ‌చ్చు ?

LEAVE A REPLY