శ్రీరాముడి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి-నాగ‌బాబు

0
71

అమరావ‌తిః హిందువులు దైవంగా భావించే శ్రీరాముడి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని సినీ నటుడు, నిర్మాత నాగబాబు డిమాండ్ చేశారు.రామాయణం అనేది కేవలం ఒక పుస్తకం కాదని,అది హిందూ ధర్మం గురించి చెప్పే గ్రంధంమ‌న్నారు. క్రిస్టియన్స్‌కు బైబిల్, ముస్లింలకు ఖురాన్ ఎలాంటిదో హిందువులకు రామాయణం,మహాభారతం,భగవద్గీత అలాంటివి.వీటిని మీద ఎవరు కామెంట్ చేసినా తప్పే.అటు ముస్లింల మొక్క ఖురాన్ మీద కామెంట్ చేసినా, క్రిస్టియన్స్ బైబిల్ మీద కామెంట్ చేసినా, హిందువుల గ్రంధాలను కామెంట్ చేసినా ఏదైనా తప్పేఅన్నారు.నా మతం మీద, నా రామాయణం మీద కామెంట్ చేసిన నీచులను కఠినంగా శిక్షించాలి. ఆ వ్యక్తి పేరు చెప్పడానికి కూడా నా మనసు అంగీకరించం లేదు.అతడికి భయంకరమైన శిక్ష పడితీరాలి.చంద్రబాబునాయుడుగానీ,కేసీఆర్ కానీ ఈ విషయంలో రియాక్ట్ కాకపోతే చారిత్రాత్మక తప్పదం చేసిన వారు అవుతారు,హిందూ సమాజాన్ని నిర్లక్ష్యం చేసిన వారు అవుతారన్నారు.నేను మతతత్వ మనిషిని కాదు, మత పిచ్చి ఉన్నవాడిని కాదు. కానీ హిందూ మతాన్ని అభిమానించే వాడిని, హిందువును. శ్రీరాముడు మా ఇలవేల్పు.ఆయన్ను ఏమైనా అంటే మేము ఊరుకోం.ప్రభుత్వం,పోలీసులు ఇలాంటి కామెంట్స్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోకుండా ఉంటే ప్రజలకు మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు.చంద్రబాబు, కేసీఆర్ లకు చేతులెత్తి దండం పెడుతున్నా,,దయచేసి ఇలాంటి వారిపై చర్యలు తీసుకోకపోతే ఆ తర్వాత జరిగే పరిణామాలకు మేము కానీ,మా హిందూ సమాజం కానీ బాధ్యులు కాదు.మీరూ హిందువులైతే, న్యాయం,ధర్మ తెలిసిన వాళ్లు అయితే రియాక్ట్ అవ్వండని కోరారు.

LEAVE A REPLY