ఫిలిమ్ న‌గ‌ర్‌లో రోడ్డుపై న‌గ్నంగా శ్రీరెడ్డి

0
150

అమ‌రావ‌తిః తెలుగు సినిమాప‌రిశ్ర‌మ‌లో ఇటీవల కాలంలో సంచలనంగా మారిన శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ దారుణాలు గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తోంది.తనని చాలా మంది సినీప్రముఖులు అవకాశాల పేరుతో వాడుకుని వదిలేశారని మీడియా ముందు లొగుట్టు విప్పి,ద‌ర్శ‌కులు, నిర్మాత‌ల‌కు,హిరోల‌కు గుబులు పుట్టించింది.తెలంగాణా ప్రభుత్వం స్పందించి దీనిపై చర్యలు తీసుకోకుంటే ఆమరణ దీక్ష చేస్తానని హెచ్చరిస్తు,అప్పటికి దిగిరాకుంటే నగ్నంగా ఫిలిం నగర్‌లో నిలబడి నిరసన తెలుపుతానని హెచ్చరించింది.అన్నట్లుగానే శ‌నివారం ఉద‌యం శ్రీ రెడ్డి హైదరాబాద్ ఫిలింనగర్‌లోని ఫిలిం ఛాంబర్‌కు వెళ్లింది.ఆ తర్వాత ఫిలిం ఛాంబర్ ముందు తన ఒంటిపై ఉన్న బట్టలను విప్పేసింది.దాంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న జనం ఉలిక్కిపడ్డారు.అప్పటికే కొందరు మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకొన్నారు.అమె మీడియాతో మాట్లాడుతూ మూవీ ఆర్టిస్ అసోషియేషన్‌లో తనకు సభ్యత్వం ఇవ్వడం లేదని,తనకు అన్యాయం జ‌రుగుతుంద‌ని ఆవేదనను వ్యక్తం చేసిన,, సినీ ప్రముఖులు పట్టించుకోక‌పోవ‌డంతో ఈ చర్యకు పూనుకొన్నట్లు చెప్పారు.ఇటీవల ఓ టెలివిజన్ చర్చ కార్యక్రమంలో సినీ పరిశ్రమలోని పెద్దలపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది.నటిగా నాకు ఇండస్ట్రీలో గుర్తింపు కార్డు ఇవ్వలేదని, సీనియర్ నటులు నాకు అండగా నిలువడం లేదన్నారు. తెలుగు అమ్మాయిలు కష్టపడుతుంటే నోరు తెర‌వ‌డంలేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.శ్రీరెడ్డి చేసిన ఆరోపణలపై నటి కల్యాణి స్పందిస్తు,ఇలా చవకబారు రీతిలో శ్రీరెడ్డి వ్యవహరిస్తే పరిశ్రమ పెద్దలు,నటీనటులు ముందుకురాన్నారు.శ్రీరెడ్డికి అండగా నిలువాలి అని తాను కొందరిని కోరగా.. సినీ పరిశ్రమను బజారుకు ఈడిస్తే ఎవరు మద్దతిస్తారని నన్ను కొందరు నిలదీశారు అని కల్యాణి చెప్పింది.

LEAVE A REPLY