హైదరాబాద్ లో సైంటిస్టు దారుణహత్య!

అమరావతి: హైదరాబాద్ లో ఓ సైంటిస్టు దారుణహత్యకు గురయ్యారు.ధరమ్‌కరణ్ రోడ్డులో నివసించే ఎస్.సురేశ్ కుమార్(56) తన నివాసంలో గుర్తు తెలియని దుండగుల చేతిలో ప్రాణాలు కోల్పోయారు. సురేష్ కుమార్ బాలానగర్ ధరమ్‌కరణ్ రోడ్డులోని అన్నపూర్ణ అపార్ట్ మెంట్‌లో నివాసంముంటున్న, సురేష్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీలో సీనియర్ సైంటిస్టుగా పనిచేస్తున్నారు.ఈయన భార్య ఇందిర ఉద్యోగరీత్యా చెన్నైలో నివసిస్తున్నారు.ఇండియన్ బ్యాంకులో మేనేజర్ గా గతంలో అమీర్ పేట బ్రాంచ్ లో పనిచేసిన ఆమెకు చెన్నై బదిలీ అయింది.అప్పటినుంచి సురేశ్ కుమార్ ఒక్కరే ఉంటున్నారు. మంగళవారం ఉదయం ఆఫీసుకు రావాల్సిన సురేష్ ఎంతకీ రాకపోవడంతో సహోద్యోగులు ఫోన్ చేశారు.ఫోన్ ఎవరూ లిఫ్ట్ చేయకపోగా, కొద్దిసేపటికి అది స్విచాఫ్ అయింది.దింతో వారు చెన్నైలో ఉన్న ఆయన భార్య ఇందిరకు సమాచారం అందించగా ఆమె హైదరాబాద్ బయల్దేరి వచ్చారు.ఆమె సమక్షంలో పోలీసులు ఇంటి తలుపులు తెరిచి లోపలికి వెళ్లిచూడగా సురేశ్ కుమార్ రక్తపుమడుగులో కనిపించారు.ఆయన తలపై బలమైన గాయం ఉండడంతో అది హత్యేనని భావించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ఆరంభించారు.

LEAVE A REPLY