టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాష్‌ అరెస్ట్

అమరావతి: హైదరాబాద్‌ బంజారాహిల్స్ పోలీసులు టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాష్‌ను శనివారం అరెస్ట్ చేశారు.గతంలో టీవీ9 స్టూడియోకు వచ్చిన సమయంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే అభియోగంపై రవి ప్రకాష్‌ను అరెస్ట్ చేశారు.రవిప్రకాష్‌ ఇంటికి వెళ్లిన 10 మంది పోలీసులు బృందం, ఆయనను అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు.రవి ప్రకాష్ పై గతంలో అనేక కేసులు ఉండగా ప్రస్తుతం రవి ప్రకాష్ బెయిల్‌పై ఉన్నారు.టీవీ 9 ఫోర్జరీ కేసు,లోగోలు అమ్ముకున్న కేసు,అక్రమ సంపాదనలపై గతంలో కేసులు నమోదయ్యాయి.పాత కేసులు అలా ఉండగానే మరో ఫిర్యాదు అందింది.. దీంతో ఆయనను అరెస్ట్ చేసిన బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఇప్పటికే రవిప్రకాష్‌పైన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో రెండు కేసులు నమోదు కాగా నిధుల గోల్మాల్ సంబంధించి ఒక కేసు,టీవీ9 లోగోను అనధికారికంగా అమ్మారనే ఆరోపణలపై మరో కేసు నమోదైంది.ఈ రెండు కేసులు సంబంధించి అతని పైన ఇప్పటికే 41 సీఆర్‌పీసీ కింద నోటీసు ఇచ్చారు.ఈ రెండింటిలో కూడా గతంలోనే పోలీసులు విచారించారు.అయితే ఏబీసీఎల్‌ కంపెనీకి చెందిన రూ. 18 కోట్ల డబ్బుని వ్యక్తిగతానికి వాడుకున్నారని,మాజీ సీఈవో రవిప్రకాష్, మూర్తిలు కంపెనీ నిధుల్ని ఇతర డైరెక్టర్లకి చెప్పకుండా విత్ డ్రా చేసినట్టు నిర్ధారించారు.దీంతో రవిప్రకాష్‌ను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.