ప్రవేట్ బస్సు ట్రావెల్స్ ఆపరేటర్స్ నిలువు దొపిడి

దసరా పండుగ బస్సు ఎక్కి కూర్చుంది…అమరావతి: తెలంగాణ ప్రాంతంలో ట్రావెల్స్ యాజమానుల టిక్కెట్స్ పై దొపిడి ప్రారంభంమైంది.దసరా పండుగ,అపైన వరుసగా శెలవులు రావడంతో,చిన్న చితక ఉద్యోగాలు చేసుకునే వారు సైతం సొంత ఉర్లకు వెళ్లెందుకు ప్రయాణానికి సిద్దంమౌవుతున్న సమయంలో తెలంగాణ ఆర్టీసీ సమ్మె వారిపై పిడుగు పాటు రూపం పడింది…ఇలాంటి సమయం కోసం ఎదురు చూస్తున్న ప్రవేట్ ట్రావెల్స్ బస్సుల యాజమానులు దొపిడికి తెర లేపారు…మాములుగా అయితే హైదరాబాద్ నుండి నెల్లూరుకు నాన్ ఏసి రూ.550 లేక పోతే 600 వుంటుంది.శుక్రవారం నుండి ఈ దొపిడి రూ.2000 వేల వరకు వెళ్లిందని ప్రయాణికుడు తెలిపాడు.. అది కూడా ట్రావెల్స్ ఏజెంట్లను బ్రతిమిలాడుకుంటేనే… టిక్కెట్ దొరికిందన్నారు.నాలుగురు కుటుంబ సభ్యులు నెల్లూరుకు రావలంటే సరాసరిన రూ.8000 వేలు చెల్లించుకోవాల్సిందే….రైళ్లలో చూస్తు టిక్కెట్లు దొరికే పరిస్థితి కన్పించదు,,తాత్కల్ లాంటి కోటాలు ఓపెన్ చేసిని నిమిషాల వ్యవధిలో అయిపోతాయి…మరి సగటు జీవికి దిక్కెది…? అధికారులు ఏమో పండుగ,సమ్మెను దృష్టిలో వుంచుకుని 200 బస్సులు నడిపిస్తున్నమంటు,, ప్రకటనలు,,,వాస్తవానికి హైదరాబాద్ నుండి ఆంధ్రప్రాంతానికి ఇలాంటి పండుగ సమయంలో దాదాపు లక్ష నుండి ఒకటిన్నర లక్ష మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు వెళ్లుతుంటారు…మరి వీరందరికి ప్రయాణ సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వున్నట్ల ? లేన్నట్ల ? ఇక  ప్రవేట్ ట్రావల్స్ ఆపరేటర్లుకు మాత్రమే దసరా పండుగ అనుకోవడంలో ఎలాంటి అతిశయెక్తి లేదేమో..టిక్కెట్ల ధరలు చూస్తుంటే… హైదరాబాద్ నుంచి విజయవాడకు రూ. 1000 నుండి రూ.1200…విశాఖపట్నానికి రూ.3 వేలు, అదిలాబాద్‌, నిజామాబాద్‌కు రూ.1500పైనే వసూలు చేస్తున్నారు.ఇంకా కొన్ని రూట్లల్లో అయితే.. బస్సు బయలుదేరే సమయంలో ఆపరేటర్లు,ఏజెంట్ల నోటికి ఎంత వస్తే అంత వసూళ్లు చేస్తున్నారని,ఇదే సమయంలో  కొన్ని ట్రావెల్స్ ఛార్జీలు విమాన ఛార్జీల కంటే ఎక్కువగా ఉంటున్నాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు ఇది చాలదన్నట్లుగా టికెట్‌ బుకింగ్‌ యాప్‌లోనూ ప్రయాణికులు మోసం పోతున్నారు.ప్రైవేట్ ట్రావెల్స్‌. విజయవాడ టికెట్‌ రూ.500 అని ఉంటుంది. క్లిక్‌ చేసి.. టికెట్‌ బుక్‌ చేసే టైంలో అది కాస్త రూ.2000 చూపిస్తోంది.దసరా పండుగకు వరుస సెలవులు కాస్త కొండెక్కి కూర్చున్నాయి…బడుగు జీవుల వ్యతలు ఎప్పడు ఇంతే మరి ????