విజ‌య్‌బాబుజీ అంటు ఆప్యాయంగా ప‌ల‌క‌రించిన-ప్ర‌ధాని

0
89

అమ‌రావ‌తిః దేశంలోని పేద ప్రజలందరికీ అన్ని రకాల వైద్య సదుపాయాలను అందుబాటులో తీసుకురావడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ‘ప్రధానమంత్రి భారతీయ జనౌషధి ప్రయోజన(పీఎంబీజేపీ)’ పథకం లబ్ధిదారులతో ప్రధాని మోడీ గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ఈ పథకం ద్వారా వారు ఎలా లబ్ధిపొందారు? వారి ఆరోగ్య పరిస్థితిని మోడీ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన విజయ్ బాబు అనే లబ్ధిదారుడితో ప్రధాని మోడీ తెలుగులో పలకరించారు.దేశవ్యాప్తంగా జనౌషధి కేంద్రాలను కూడా ఏర్పాటుచేశారు. వీటిలో 600లకు పైగా మందులు, 154 శస్త్రచికిత్స పరికరాలు తక్కువ ధరకే అందిస్తున్నారు. పథకంలో అమల్లోకి వచ్చి రెండున్నరేళ్లు దాటిన సందర్భంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ లభ్ధిదారులతో మాట్లాడారు.

LEAVE A REPLY