ఒక మగ వగలాడి కోసం ఈ ప్రెస్ మీట్-పోసాని

0
147

పోసాని సంచలన వ్యాఖ్యలు
అమ‌రావ‌తిః ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్రబాబునాయుడిపై ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఒక మగ వగలాడి కోసం ఈ ప్రెస్ మీట్ పెట్టాను. ఆ మగ వగలాడి ఎవరో మీకు తెలుసు.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుగారు. చంద్రబాబుగారు ఏ పరిస్దితిలో ఓడిపోయి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారో ? ఏ పొజిషన్‌లో ఆయన్ని ఎన్టీ రామారావుగారు ఆదరించారో ? ఏ పొజిషన్‌లో ? ఎన్టీ రామారావు గారిని చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచారో.. ఆయన పార్టీ లాక్కుని, జెండా లాక్కుని..ఆయన జీవితాన్ని లాక్కుని..ఆయనపై చెప్పులేసి.. ఆయన చావుకు కారణమైన నారా చంద్రబాబునాయుడుగారికి సంబంధించిన ఫొటోలు చూడండి’ అంటూ సంబంధిత ఫొటోలను పోసాని చూపించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏమిటో చెప్పడానికి ఇవి చాలదా.. అంటూ పోసాని సోమవారం నిప్పులు చెరిగారు.
ప్రత్యేక హోదా, ఆస్తులు, ఎన్టీఆర్ నుంచి కుర్చీ లాక్కోవడం, బీజేపీ, వామపక్షాలు, పవన్ కళ్యాణ్‌ను ఉపయోగించుకొని, వదిలేయడం.. ఇలా ఎన్నో అంశాలతో టీడీపీ అధినేతపై విమర్శలు గుప్పించారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని చెప్పారు. ప్రత్యేక హోదా వద్దని గతంలో చంద్రబాబు ఎందుకు అన్నారని, ఇప్పుడు ఎందుకు కావాలంటున్నారో చెప్పాలన్నారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రం కట్టాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీసుకున్నదని ప్రశ్నించారు. ఇలా చంద్రబాబు ఏమిటో చెప్పడానికి ఎన్నో ఉన్నాయన్నారు.రాజకీయాల్లో చంద్రబాబు బ్రోకర్ పనులు చేస్తున్నారని పోసాని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు మేకవన్నె పులి అన్నారు. జగన్ చాలా స్పష్టంగా మాట్లాడుతారని చెప్పారు. టీడీపీని స్థాపించిన కొత్తలో.. తాను ఎన్టీఆర్‌ను అయినా ఓడిస్తానని చంద్రబాబు చెప్పారని, ఆ తర్వాత ఓడిపోగానే టీడీపీ పంచన చేరారని మండిపడ్డారు. ఆ తర్వాత ఎన్డీఆర్ జెండాను దొంగిలించారన్నారు. చంద్రబాబు అందరినీ మోసం చేశారన్నారు.
ఓటుకు నోటు కేసులో చంద్రబాబు దోరికిపోయాడని పోసాని ఆరోపించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు మానవత్వం లేకుంటే ఇప్పటికి జైళ్లో ఉండేవాడిని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకు ఎవరి కాళ్లు పట్టుకున్నావో చెప్పాలని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో కేసీఆర్ కాళ్లు పట్టుకొని చంద్రబాబు విజయవాడకు పారిపోయారన్నారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు యూటర్న్ తీసుకొని ఇప్పుడు మోడీపై విమర్శలు చేస్తున్నారన్నారు. రాజకీయంగా ఎవరు తనతో వచ్చినా చంద్రబాబు వారిని నాశనం చేస్తారన్నారు. ప్రధాని నరేంద్ర మోడీలో చంద్రబాబుకు ఏం మార్పు కనిపించిందో చెప్పాలన్నారు. ప్రత్యేక హోదా వద్దని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు మోడీని దుర్మార్గుడు అనడం ఏమిటన్నారు.
2014 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో కలిసి గెలిచారని, ఇప్పుడు ఆయనను తిడుతున్నారని పోసాని ధ్వజమెత్తారు. మోడీ, పవన్, వామపక్షాలు, వాజపేయి.. ఇలా ఎవరితోనైనా కలిసి వారిని విలువలు లేవని తిట్టడం చంద్రబాబుకు అలవాటు అన్నారు. చంద్రబాబు కమ్మ, కాపుల మధ్య గొడవ పెట్టలేదా అని పోసాని ప్రశ్నించారు. త్వవరలో ఎన్నికలు రాబోతున్నాయని, కాబట్టి ప్రజలు మంచి నేతను ఎన్నుకోవాలని సూచించారు. పోసాని ఓ వర్గం మీడియాపై (టీడీపీ అనుకూల మీడియా) తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ఒక వర్గం మీడియా కులం జబ్బు నుంచి బయటకు రావాలని సూచించారు. మీడియానే ఇలా ఉంటే ప్రజాస్వామ్యం చనిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

LEAVE A REPLY