డ్రంకెన్‌ డ్రైవ్‌లో దొరికితే ట్రాఫిక్ డ్యూటీ త‌ప్ప‌దు

0
92

అమ‌రావ‌తిః హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌,ఉప్పల్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ల పరిధిలో ఇటీవల డ్రంకెన్‌ డ్రైవ్‌ సహా ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘిస్తూ పట్టుబడిన వారు ఈరోజు ‘ఒకరోజు ట్రాఫిక్ విధులు’ నిర్వర్తించారు.కోర్టు వారికి వేసిన శిక్ష మేరకు ఇలా విధులు నిర్వర్తించారని రాచకొండ పోలీసులు తెలిపారు.మద్యం తాగి వాహనం నడపరాదు’ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ వారంతా ప్రచారం చేశారు.ఇందుకు సంబంధించిన ఫొటోలను రాచకొండ పోలీసులు తమ ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేశారు.సురక్షితంగా గమ్యస్థానానికి చేరేందుకు నిబంధనలు పాటిస్తూ డ్రైవింగ్‌ చేయాలని సూచించారు.

LEAVE A REPLY